టాటా టియాగో ఈవీ: బుకింగ్స్.. సూపర్ రికార్డ్?

Purushottham Vinay
ఇక టాటా కంపెనీ గత సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన కొత్త 'టాటా టియాగో ఈవీ' కి ఏకంగా ఇప్పటికి 20,000 కంటే ఎక్కువ బుకింగ్స్  అయ్యినట్లు అధికారిక సమాచారం అనేది తెలుస్తుంది. ఈ కార్ లో జనాలకు నచ్చిన విషయాలు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా టాటా టియాగో ఈవీ ధర విషయానికి వస్తే.. చాలా సరసమైన ధర అనే చెప్పాలి. ఈ కార్ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ ధర వల్ల ఈ ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత సరసమైన కారుగా పేరు సంపాదించింది. ఇక ఈ కార్ మొత్తం 4 ట్రిమ్స్ లో మనకు అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ ఇంకా అలాగే XZ+ టెక్ లక్స్.ఇక కంపెనీ ఈ టియాగో ఈవీ కోసం 2022 అక్టోబర్ 10 నుంచి బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది.


అయితే మొదట వెల్లడించిన ధరలు కేవలం 10,000 యూనిట్లకు మాత్రమే పరిమితం అని ప్రారంభంలో కంపెనీ తెలిపింది. కానీ ఆ తరువాత ఈ ధరలను మొత్తం 20,000 యూనిట్ల వరకు కూడా పెంచింది.ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారుని బుక్ చేసుకున్న కస్టమర్లు 2023 జనవరి నాటికి డెలివరీలను పొందే ఛాన్స్ ఉంటుంది. అంతకంటే ముందు టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరి నాటికి స్టార్ట్ అవుతాయాని కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు కంపెనీ పొందిన బుకింగ్స్ గురించి అధికారిక సమాచారాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన 'శైలేష్ చంద్ర' స్వయంగా వెల్లడించారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.ఇక ఈ కొత్త టాటా టియాగో ఈవి కార్ 19.2kWh ఇంకా అలాగే 24kWh అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ రేంజ్ ని ఇంకా అలాగే 24kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ రేంజ్ ని అందిస్తుంది. ఈ టియాగో ఈవి కార్ 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఈజీగా ఛార్జ్ చేసుకోగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: