ఈ మధ్య కాలంలో 'లెక్సస్' కార్లకి కూడా ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ పెరుగుతుంది. మంచి లగ్జరీ కార్లని తయారు చేస్తూ ఈ బ్రాండ్ బాగా దూసుకుపోతుంది.ఇక 'లెక్సస్ ఇండియా' తన 'ఎల్ఎక్స్ 500డి' (LX 500d) SUV కార్ ని విడుదల చేయడం జరిగింది. ఈ SUV కార్ ధర వచ్చేసి రూ.2.82 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన లెక్సస్ ఎల్ఎక్స్ 500డి (Lexus LX 500d) ఫస్ట్ బ్యాచ్ డెలివరీలు 2023 జనవరి నుంచి మార్చి మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది.ఇంకా అంతే కాకుండా ఈ SUV కార్ రాబోయే 2023 ఆటో ఎక్స్‌పోలో RX SUV ఇంకా LC కూపేతో పాటు పెర్ఫార్మ్ చేయబడుతుంది. ఈ కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 500డి SUV టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 కంటే కూడా చాలా లగ్జరీగా ఉంటుంది.ఇక ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే.. ఈ లెక్సస్ ఎల్ఎక్స్ 500డి స్క్వేర్డ్-అవుట్ వీల్ ఆర్చ్‌లు ఇంకా పెద్ద అల్లాయ్ వీల్స్ వంటి వాటిని కలిగి ఉంది. అలాగే దీని ముందు భాగంలో పెద్ద లెక్సస్ సిగ్నేచర్ గ్రిల్ దానికి రెండు వైపులా కూడా హెడ్‌ల్యాంప్స్ అనేవి ఉంటాయి. ఇంకా అలాగే సైడ్ ప్రొఫైల్ LC300 ని పోలి ఉన్నప్పటికీ వెనుక వైపు కొంచెం డిఫరెంట్ గా ఉండి రియర్ క్వార్టర్ విండోని కలిగి ఉంది.
ఇంకా అంతే కాకుండా LX కనెక్టెడ్ లైట్ బార్ ఇంకా బ్రాండ్ లోగోకు బదులుగా టెయిల్‌గేట్‌పై లెక్సస్ లెటర్స్ ని చూడవచ్చు.లెక్సస్ ఎల్ఎక్స్ 500డి సరికొత్త ఇంటీరియర్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఇంటీరియర్ నాలుగు కలర్స్ లో ఉంటుంది. అవి ట్యాన్, రెడ్, వైట్ ఇంకా అలాగే వైట్ & బ్రౌన్ (కంబైన్డ్ కలర్). ప్రస్తుతం వరల్డ్ మార్కెట్లో లెక్సస్ ఎల్ఎక్స్ మోడల్ 5 సీటర్ ఇంకా అలాగే 7 సీటర్ కాన్ఫిగరేషన్లతో అందుబాటులోని ఉంది. కానీ ఇండియన్ మార్కెట్లో 5 సీటర్ మాత్రమే లభించే ఛాన్స్ ఉంది.లెక్సస్ ఎల్ఎక్స్ 500డి ట్విన్-స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. పైన భాగంలో 12.3 ఇంచెస్ యూనిట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది.ఇంకా దానికి కింది భాగంలో 7.0 ఇంచెస్ స్క్రీన్ ఆఫ్-రోడ్ డేటా అలాగే క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్లను చూపుతుంది. ఇక అంతే కాకుండా ఇందులో 8 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లేగా బాగా పనిచేస్తుంది. ఇంకా వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం 11.6 ఇంచెస్ వైర్లెస్ రిమోట్ కంట్రోల్‌తో కూడిన టచ్స్క్రీన్లు కూడా ఉంటాయి.