న్యూ ఇయర్ 2023 కానుకగా bmw కంపెనీ కొత్త మోడల్స్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి రెడీ అయిపోయింది. ఇందులో భాగంగానే bmw కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్త i7 సెడాన్ ని విడుదల చేసింది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ bmw i7 సెడాన్ ధర వచ్చేసి రూ. 1.95 కోట్లుగా ఉంది. ఇది xDrive 60 అనే ఒకే వేరియంట్ లో వస్తుంది. ఇంకా అంతే కాకుండా ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా వస్తుంది. ఈ సెడాన్ చూడటానికి చాలా అద్భుతమైన డిజైన్ కలిగి సరికొత్త ఫీచర్స్ కలిగి ఉంది.అందువల్ల వాహన వినియోగదారులను ఈ కార్ తప్పకుండా ఆకర్శించే అవకాశం ఉంది.BMW i7 డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎక్కువ భాగం బ్లూ యాక్సెంట్స్ ఉంటాయి. ఇంకా అంతే కాకుండా ఫ్రంట్ గ్రిల్ మీద ఐ బ్యాడ్జ్ కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ సెడాన్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ ని కలిగి కొత్త అల్లాయ్ వీల్స్ ని కూడా పొందుతుంది. ఇంకా అలాగే డోర్ హ్యాండిల్స్ లాంగ్-వీల్‌బేస్ డిజైన్ కలిగి ఉంటుంది. దీని రియర్ ప్రొఫైల్ లో 7 సిరీస్‌తో సమానంగా ఉంటుంది, i7 బ్యాడ్జ్ కూడా ఉంటుంది.
BMW i7 సెడాన్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది చాలా లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.ఇక ఇందులో 14.9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఇంకా 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. ఇందులో bmw లేటెస్ట్ iDrive 8 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా అంతే కాకుండా 31.3 ఇంచెస్ 8K 'సినిమా' స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. ఇది అమెజాన్ ఫైర్ టీవీ ద్వారా వీడియో స్ట్రీమింగ్‌ను అందించడానికి అనుకూలంగా ఉంటుంది.అలాగే వెనుక డోర్స్ 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మాత్రమే కాకుండా క్లైమేట్ కంట్రోల్ ఇంకా సీటింగ్ కంట్రోల్ వంటి వాటి కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో 31.3 ఇంచెస్ 8K 'సినిమా' స్క్రీన్ పైకి ముడుచుకోవడానికి కూడా అనుకూలంగా డిజైన్ చేయబడింది. మొత్తం మీద bmw i7 సెడాన్‌లో అందుబాటులో ఉన్న ఇవన్నీ కూడా ప్రయాణికులకు చాలా మంచి లగ్జరీ అనుభూతిని అందించడంలో బాగా సహాయపడతాయి.