టయోటా హైలక్స్ పికప్: మళ్ళీ బుకింగ్స్ ఓపెన్?

Purushottham Vinay
గత ఏడాది ఇండియన్ మార్కెట్లో విడుదలైన టయోటా  హైలక్స్ పికప్ ట్రక్కు కోసం, అతి తక్కువ కాలంలోనే మంచి  బుకింగ్స్ వచ్చాయి. అయితే బుకింగ్స్ ఓపెన్ అయిన అతి తక్కువ సమయంలోనే కంపెనీ టెంపరరీ బుకింగ్స్ నిలిపివేసింది.అయితే ఇక ఈ పికప్ ట్రక్కు కోసం బుకింగ్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి.జపనీస్ కార్ల తయారీ కంపెనీ టయోటా తన హైలక్స్ పికప్ ట్రక్కుని మూడు వేరియంట్స్ లో రిలీజ్ చేసింది. అవి హైలక్స్ మ్యాన్యువల్ స్టాండర్డ్, హైలక్స్ మ్యాన్యువల్ హై ఇంకా హైలక్స్ ఆటోమేటిక్ హై వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 33.99 లక్షలు, రూ. 35.80 లక్షలు, రూ. 36.80 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఇక ఈ మూడు వేరియంట్లు కూడా స్టాండర్డ్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో మార్కెట్లో లభిస్తాయి.అయితే టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ అనేది ఐఎమ్‌వి-2 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది ఇండియాలో  అసెంబుల్ చేయబడుతుంది.ఇంకా ఈ పికప్ ట్రక్కు డబుల్ క్యాబిన్ 5-సీటర్ వెహికల్. ఈ పికప్ ట్రక్కు ట్రెడిషనల్ ఎస్‌యూవీగా ఇంకా అలాగే ప్రీమియం లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కుగా కూడా ఉపయోగపడుతుంది.


ఇలాంటి పికప్ ట్రక్కులు ఇండియన్ మార్కెట్లో అంతగా ప్రజాదరణ పొందలేదు. కానీ అమెరికా వంటి పెద్ద దేశాల్లో ఈ వాహనాలకు డిమాండ్ బాగా ఎక్కువ.టయోటా హైలక్స్ సైజు పరంగా చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ పికప్ ట్రక్కు  కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ ఇంకా అలాగే ఎత్తు 1,865 మి.మీ ఉంటుంది. ఇక వీల్‌బేస్‌ 3,085 మి.మీ వరకు ఉంటుంది. ఇక అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నుల దాకా ఉంటుంది. అందువల్ల ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.టొయటా హైలక్స్ పికప్ ట్రక్కు  డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో పెద్ద హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్ ఇంకా అలాగే ఇరు వైపులా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ముందు వైపు నుండి ఇది స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఇంకా వెనుక వైపు ఇది నిలువుగా ఉండే టెయిల్ లైట్స్ అలాగే క్రోమ్ గార్నిష్‌తో కూడిన బంపర్ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: