బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్: సూపర్ ఫీచర్లతో విడుదల?

Purushottham Vinay
ఇక ఇండియన్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన మహీంద్రా నేడు తన 'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' ని రిలీజ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర వచ్చేసి రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న బొలెరో నియో  టాప్ స్పెక్ వేరియంట్ అయిన N10 వేరియంట్ ఆధారంగా డిజైన్ చెయ్యబడింది. అయితే ఈ కొత్త వేరియంట్ దాని పాత మోడల్ కంటే కూడా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇంకా అంతే కాకుండా ఇది N10 వేరియంట్ కంటే రూ.29,000 ఎక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర N10 (ఓ) కంటే రూ. 78,000 తక్కువ ఉంటుంది.ఇక కొత్త మహీంద్రా బొలెరో నియో ఎన్10 లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు రూఫ్ స్కీ ర్యాక్, కొత్త ఫాగ్ లైట్స్ ఇంకా అలాగే ఇంటిగ్రేటెడ్ DRL తో కూడా హెడ్ లాంప్ వంటి వాటితో పాటు అల్లాయ్ వీల్స్ అలాగే ఎక్స్ షేప్ వీల్ కవర్‌తో టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ ఇంకా బ్లూసెన్స్ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్ ఇంకా స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్లను కూడా కలిగి ఉంది.ఇంకా ఈ కొత్త ఎడిషన్ లో  ఫాక్స్ లెదర్ సీట్లు ఇంకా డ్రైవర్ & కో డ్రైవర్ సీట్లకు లంబర్ సపోర్ట్ అనేది ఉంటుంది.


అలాగే వీటితో పాటు ఈ లిమిటెడ్ ఎడిషన్ లో రివర్స్ పార్కింగ్ కెమెరా ఇంకా డ్రైవర్ సీటు కింద స్టోరేజ్ ట్రే వంటివి కూడా లభిస్తాయి. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ చూడటానికి దాని పాత మోడల్ లాగా ఉన్నప్పటికీ, ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ ని మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు బాగా అనుకూలంగా ఉంటాయి.మహీంద్రా లాంచ్ చేసిన కొత్త నియో లిమిటెడ్ ఎడిషన్ లో కొత్త ఫీచర్స్ వున్నా కూడా ఇంజిన్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. అందువల్ల మహీంద్రా బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ అదే 1.5-లీటర్ mHawk100 డీజిల్ ఇంజన్ తో వస్తుంది. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్ ఇంకా 2250 ఆర్‌పిఎమ్ వద్ద 260 ఎన్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి యాడ్ చేయబడి ఉంటుంది.ఇక మహీంద్రా బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ లో మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ (MLD) సిస్టంని పొందదు. ఇది ఓన్లీ N10 (O) వేరియంట్‌ కు మాత్రమే ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ ని ఆదా చేయడం కోసం స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా ఉంటుంది.అలాగే ఇందులో ఎకో డ్రైవ్ మోడ్ కూడా ఉంటుంది. అందువల్ల ఫ్యూయల్ ని కూడా మీరు కొంత వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది కూడా వాహన వినియోగదారులకు  బాగా అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: