ఇక 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మంచి డిస్కౌంట్ పై అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 26 వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 29 దాకా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 15,000 దాకా డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కంపెనీ అందిస్తుంది. ఈ స్కూటర్ ను కొనేవారికి రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ తో పాటు రూ. 5,000 అదనపు డిస్కౌంట్ ను కూడా ఓలా కంపెనీ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఖాకీ కలర్ వేరియంట్ పై మాత్రమే అందుబాటులో ఉంటుందట. అలాగే వినియోగదారులు ఓలా అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో అదనంగా రూ .10,000 దాకా డిస్కౌంట్ ను పొందవచ్చు.ఇక ఓలా ఎలక్ట్రిక్ 2021 లో ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని స్టార్టింగ్ ధర రూ .1.40 లక్షలుగా ఉంది. పింగాణీ వైట్, ఖాకీ, నియో మింట్, కోరల్ గ్లామర్, జెట్ బ్లాక్, మార్ష్ మెలో, లిక్విడ్ సిల్వర్, మిలీనియల్ పింక్, ఆంత్రాసైట్ గ్రే, మిడ్ నైట్ బ్లూ ఇంకా అలాగే మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.
ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 170 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తుంది. అంతేగాక ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి 6 గంటల టైం పడుతుంది. ఈ స్కూటర్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్, హైపర్ అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయని ఓలా కంపెనీ లాంచింగ్ అప్పుడు ప్రకటించింది.ఈ మధ్య కంపెనీ ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ ని అప్ గ్రేడ్ చేసి మూవ్ఓఎస్ 3 పేరుతో రిలీజ్ చేసింది. హిల్ అసిస్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి సరికొత్త ఫీచర్లు ఈ మూవ్ఓఎస్ 3 లో అందుబాటులో ఉన్నాయి. సరికొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ తో అందుబాటులోకి వచ్చిన మెయిన్ ఫీచర్లలో హైపర్ ఛార్జింగ్ అనేది కూడా ఒకటి. ఇక ఇది కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ తో 50 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.ప్రాక్సిమిటీ అన్ లాక్ ఇంకా అలాగే పార్టీ మోడ్ వంటి వివిధ రకాల ఫీచర్లు కూడా ఈ మూవ్ ఓఎస్ 3 లో ఉన్నాయి.