Rapido: ఇకపై ఆటోలలో సీటు బెల్ట్స్?

Purushottham Vinay
ఫేమస్ ఆటో రెంట్ కంపెనీ రాపిడో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. తమ రెంట్ ఆటోలలో ప్రయాణించే వారి కోసం సీట్ బెల్ట్ లను ఫిక్స్ చేస్తున్నట్లు చెప్పింది.తమ ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఈ చర్య బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.బెంగళూరులో మొదట ఈ సౌకర్యాన్ని రాపిడో అమలు చేస్తుంది. నిత్యం రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. ఆటో ఆకస్మాత్తుగా ఆగిపోవడం లేదా ఢీకొన్న సందర్భాల్లో ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. అలాగే తీవ్రమైన ప్రమాదాలలో మరణాలను ఇంకా గాయాలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. అనుకోని సందర్భాల్లో జరిగే ప్రమాదాల నుంచి ప్రయాణికులను సురక్షితంగా కాపాడటం తమ ముఖ్య లక్ష్యమని ర్యాపిడో కంపెనీ పేర్కొంది.ఇంకా అలాగే వీటితో పాటు ప్రయాణీకుల భద్రత కోసం తన కంపెనీ హైర్ చేసుకున్న డ్రైవర్ కెప్టెన్ల వివరాలను ఫోర్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా వెరిఫై చేస్తుంది. దీంతో ఈజీగా వారిని ట్రాక్ చేయడంతో పాటు సకాలలంలో స్పందించేలా సిస్టమ్ ని రాపిడో కంపెనీ కలిగి ఉంది.


అలాగే దీంతో పాటు ముఖ్యంగా మహిళా రైడర్‌ల కోసం, వారి గోప్యత ఇంకా గుర్తింపు వంటి సేఫ్టీ మెజర్స్ ని కలిగిన ప్రత్యేక ఇన్ఫర్మేషన్-మాస్కింగ్ ఫీచర్‌ను కూడా ఉపయోగిస్తుంది.అలాగే యాప్ లోని లైవ్ ట్రాకింగ్ తో డేటాను యాక్సెస్‌ చేయనుంది. షేర్డ్ రైడ్‌ల కోసం రౌండ్-ది-క్లాక్ ఆన్-గ్రౌండ్ సపోర్ట్‌ను కూడా ర్యాపిడో కంపెనీ అందిస్తుంది. ఎమర్జెన్సీ ఫీచర్స్ ఇంకా చాలా అధునాతన సౌకర్యాలను యాప్ లో కల్పించింది. దీని ద్వారా రైడర్ హ్యాపీగా తన ప్రయాణాన్ని సాగిస్తాడని రాపిడో కంపెనీ వివరించింది. రైడర్ తాము సేఫ్ జోన్ లో ఉన్నరానే ఫీలింగ్ ని కల్పించేందుకు అన్నీ చర్యలు ఉన్నట్లు ర్యాపిడో కంపెనీ పేర్కొంది.ర్యాపిడో యాప్ సేఫ్టీ ఫీచర్ల ద్వారా ప్రయాణీకులు తమ రైడ్ లో సురక్షిత ప్రయాణాన్ని పొందుతారని రాపిడో ఆటో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. ప్రయాణీకులు కెప్టెన్‌లకు సురక్షితమైన ప్రయాణాన్ని ఈజీ చేయడానికి Rapido auto తన యాప్‌లో చాలా ఇతర సేఫ్టీ చర్యలను అమలు చేసిందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: