Hyundai Exter: లాంచ్, డెలివరీలు ఎప్పుడంటే?

Purushottham Vinay
ఫేమస్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్  విడుదల చేయనున్న కొత్త మైక్రో SUV 'ఎక్స్‌టర్' (Exter) లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారికి కంపెనీ ఫైనల్ గా చక్కటి శుభవార్తని చెప్పింది.ఇప్పటి దాకా డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి సమాచారం వెల్లడించిన కంపెనీ తాజాగా లాంచ్ టైమ్ ఎప్పుడనే దానికి సంబంధించిన సమాచారం కూడా వెల్లడించింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ '2023 జులై' నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.ఇప్పటికే రూ. 11,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన హ్యుందాయ్ డెలివరీలను కూడా వేగవంతం చేయడానికి తగిన ఏర్పాట్లని చేసుకుంటోంది.ఇక ఇండియన్ మార్కెట్లో అడుగెట్టనున్న ఎక్స్‌టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది.


ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది కంపెనీ ఇతర మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఈ కార్ లో హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చూడవచ్చు. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్ ఇంకా సి పిల్లర్‌కు టెక్స్‌చర్డ్ ఫినిషింగ్ వంటివాటితో పాటు ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్‌లు ఇందులో గమనించవచ్చు. ఇక రియర్ ప్రొఫైల్ లో నిలువుగా ఉండే టెయిల్ గేట్ ఇంకా షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్ అలాగే టెయిల్-ల్యాంప్‌ వంటివి కూడా ఉన్నాయి.ఇక ఇటీవల కంపెనీ తన ఎక్స్‌టర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా వెల్లడించింది. అయితే ఇందులో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయని తెలిసింది. హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఇంకా అలాగే ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి కూడా లభిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: