తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే?

Purushottham Vinay
మీరు కొత్త స్కూటర్ ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే మోడల్ ఒకటి అందుబాటులో ఉంది.అది కూడా తక్కువ ధరలోనే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని  మీరు కొనొచ్చు.ఇంకా అంతేకాకుండా దీనికి రిజిస్ట్రేషన్ కూడా దీనికి అక్కర్లేదు. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను  బడ్జెట్‌ ధరలోనే కొనుగోలు చేయాలని మీరు భావిస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ట్రై చెయ్యండి. క్రెయాన్ మోటార్స్ కంపెనీ ఈ అదిరే మోడల్‌ను మార్కెట్‌లో అమ్ముతుంది. ఇక దీని పేరు స్నో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఒక స్పెషల్ స్కూటర్. దీనిని పాకెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ . దీని ధర కేవలం రూ. 64 వేలుగా ఉంది. ఇది మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి రెడ్, యెల్లో, గ్రే, వైట్ అనేవి కలర్ ఆప్షన్లు. ఇంకా అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రెండేళ్ల దాకా వారంటీ కూడా లభిస్తుంది. అందుకే మీరు చౌక ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేయాలని భావిస్తే.. దీన్ని ఒకసారి ట్రై చెయ్యండి.అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు కేవలం 25 కిలోమీటర్లు. అందువల్ల దీనికి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. ఇంకా అలాగే దీనికి డ్రైవింగ్ లెసెన్స్‌తో కూడా పని లేదు. అందువల్ల ఎవరైనా దీన్ని చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇందులో మొత్తం 250 వాట్ బీఎల్‌డీసీ మోటార్ ఉంటుంది. అందువల్ల పవర్‌ఫుల్, కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.


దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155 ఎంఎం ఉంటుంది. అలాగే దీనికి ట్యూబ్ లెస్ టైర్లు కూడా ఉన్నాయి. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 70 కి.మి వెళ్లొచ్చు.అలాగే ఇందులో డిజిటల్ స్పీడో మీటర్, సెంట్రల్ లాకింగ్, యూఎస్‌బీ చార్జింగ్, యాంటీ థెఫ్ట్, చార్జింగ్ పోర్ట్, నావిగేషన్, లార్జ్ బూట్ స్పేస్ ఇంకా జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా మీరు ఈ స్కూటర్‌ను ఈజీగా కొనొచ్చు. ఈ కంపెనీ బజాజ్ ఫైనాన్స్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇంకా అలాగే మణప్పురం ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జెస్ట్ మనీ, షాప్‌సే ఇంకా పేటెల్ వంటి సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల మీరు ఈజీ ఫైనాన్స్ ఆప్షన్ పొందొచ్చు.ఇంకా తక్కువ ఈఎంఐ ఆప్షన్ పొందొచ్చు. మీరు లోన్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. లేదంటే ఒకేసరి డబ్బులు చెల్లించి కూడా దీన్ని కొనొచ్చు. మీకు మార్కెట్‌లో ఇంకా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్‌లో మీకు నచ్చిన మోడల్‌ను కొనొచ్చు. కేవలం రూ. లక్ష పెట్టుకుంటే అదిరే స్కూటర్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: