Revolt RV400: ఫీచర్స్ అదుర్స్.. సూపర్ బైక్?

Purushottham Vinay
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణ హితమైన ఈ వాహనాలను చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.ఎందుకంటే జనాలకు వారి లోకల్ అవసరాలకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.అందువల్ల చాలా కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రివల్యూషనరీ డిజైన్ ఇంకా ఫీచర్లతో రివోల్ట్ ఆర్వీ400 పేరిట ఓ కొత్త బైక్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. నిజానికి ఇది 10 నెలల క్రితమే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే వేల సంఖ్యలో బైక్ లు సేల్ అయ్యాయి. ఇప్పుడు ఈ బైక్ ని మరింతగా మార్కెటింగ్ చేసి, సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో మన ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ బైక్ గా నిలిచిన ఈ రివోల్ట్ ఆర్వీ400 బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంకా ఈ బైక్ 3000-వాట్ మోటార్‌ను కలిగి ఉంది.ఇది థ్రిల్లింగ్, శక్తివంతమైన రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది.


ఈ ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ చార్జ్ పై ఏకంగా 150 కిమీల రేంజ్ ని అందిస్తుంది. ఈ బైక్ లో 4kWh లిథియం-అయాన్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ఉంది. ఇది చాలా మంచి పనితీరును అందిస్తుంది.స్పీడ్ రైడర్స్ కి ఈ రివోల్ట్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ బైక్‌ మంచి అనుభూతినిస్తుంది. ఇది గంటకు ఏకంగా 85 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. అదనంగా,కంపెనీ బైక్ కి ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తుంది. అందువల్ల ఇది 2 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ అవుతుంది.ఈ బైక్ గతంలో కంటే ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.3 లక్షలుగా ఉండగా ఈ బైక్‌ను సాధించగలిగేలా ఎంఐ ప్లాన్‌ని ఎంచుకోవడానికి మీకు మంచి అవకాశం ఉంది. ఈఎంఐలను కొరుకొనే వారికి దాదాపు రూ25,000 డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన మొత్తం దాదాపు రూ. 4,682 నెలవారీ వాయిదాలలో చెల్లించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: