మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఓలా, ఏథర్ వంటి కంపెనీలు టూవీలర్ రంగంలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాయనే చెప్పాలి.అప్డేటెడ్ ఫీచర్లు, అత్యధిక రేంజ్‌తో స్కూటర్లను అందిస్తూ దేశంలోనే టాప్ లెవెల్లో సేల్స్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే హీరో, టీవీఎస్, హోండా, యమహా వంటి కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వేరియంట్‌లను మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది.ఇంకా ఇదే క్రమంలో హీరో కంపెనీ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. ఇక దాని పేరు హీరో ఎలక్ట్రిక్ అట్రియా. ఇది ఒకే వెర్షన్‌లో మొత్తం రెండు కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మన దేశంలో అట్రియా స్కూటర్ స్టార్టింగ్ ధర రూ. 77,767గా ఉంది. ఈ స్కూటర్‌లో మొత్తం 250వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇంకా దీనికి ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లే ఉంటాయి.
హీరో నుంచి వచ్చిన ఈ అట్రియా లో స్పీడ్ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇంకా రేంజ్ వంటి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ హీరో అట్రియా స్కూటర్ ఒకే మోడల్‌లో అందుబాటులో ఉంది. ఇది అట్రియా ఎల్‌ఎక్స్. ఈ స్కూటర్ లో స్పీడ్ స్కూటర్. మాక్సిమం గంటకు 25కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలుగుతుంది. అందువల్ల దీనికి డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఇంకా రిజిస్ట్రేషన్ గానీ అవసరమే లేదు. ఈ స్కూటర్ లో మొత్తం 250వాట్ల సామర్థ్యంతో కూడిని బీఎల్‌డీసీ మోటార్ ఉంటుంది. అలాగే ఇది 51.2V/30Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇక దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేస్తేఏ 85కిమీ రేంజ్‌ని అందిస్తుంది.ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోని లో స్పీడ్ విభాగంలోని స్కూటర్లతో ఈ స్కూటర్ పోటీ పడుతుంది.