ఒకప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే
బైక్ లలో
హీరో హోండా స్ప్లెండర్ ప్రథమ స్థానంలో ఉండేది. అయితే ఆ కంపెనీ రెండు విడిపోవడం ఇంకా చాలా కంపెనీల నుంచి డిఫరెంట్ మోడల్స్ అందుబాటులోకి రావడంతో
హీరో పరిధిలోకి వెళ్లిన స్ప్లెండర్ కు డిమాండ్ బాగా తగ్గింది.అయినా కూడా దేశంలోని అతి తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న
బైక్ లలో ఇప్పటికీ ఇదే తొలి స్థానంలో ఉంటుంది. అయితే
హీరో కంపెనీ ఈ స్ప్లెండర్ కొత్త మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ పేరుతో దేశంలోని అత్యంత చవకైన ద్విచక్ర వాహనంగా దీనిని లాంచ్ చేసింది. ఇది
ఇండియన్ మార్కెట్లో మైలేజీ ఆప్షన్లలో బెస్ట్ గా నిలుస్తోంది. దీని ధర ఇప్పుడు రూ. 79వేలుగా ఉంది.
హీరో కంపెనీ సింగిల్ వేరియంట్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ
హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్
బైక్ లో 100సీసీ బీఎస్6 ఇంజిన్ అనేది ఉంటుంది.ఇందులో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.అలాగే ముందు వెనుక డ్రమ్ బ్రేకులు ఉంటాయి.ఈ
బైక్ కి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్
బైక్ లో 100సీసీ సింగిల్ సిలెండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఇది 6000ఆర్పీఎం వద్ద మాక్సిమం 8బీహెచ్ పీ, 8.05ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. దీని ఇంజిన్ నాలుగు గేర్ల స్పీడ్ ట్రాన్స్ మిషన్ జోడించి ఉంటుంది.ఇక
హీరో కంపెనీ ప్రస్తుతానికి సింగిల్ డ్రమ్ బ్రేకులతో కూడిన వేరియంట్ నే రిలీజ్ చేసింది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంకా బ్లూ, గ్రే, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ
బైక్ అందుబాటులో ఉంది.ఇక
హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్
బైక్ లో ఇంజిన్ సామర్థ్యం 97.2 సీసీ ఉంటుంది. ఈ
బైక్ ఒక లీటర్
పెట్రోల్ కి మైలేజీ 60 లీటర్లు వస్తుంది. దీనికి 4 స్పీడ్ మాన్యూల్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది.ఇక కెర్బ్ వెయిట్ 112 కేజీలు ఉంటుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం మొత్తం 9.8 లీటర్లు ఉంటుంది.సీటు ఎత్తు 785ఎంఎం దాకా ఉంటుంది.తక్కువ ధరలో అధిక పనితీరు కలిగిన
బైక్ కావాలనుకొనే వారికి ఇదే మంచి ఎంపిక.