ఓలా స్కూటర్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్..?

Purushottham Vinay
ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగం అనేది తారాస్థాయికి చేరింది. దీంతో టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల దాకా మార్కెట్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేశాయి.అందుకే అన్ని కంపెనీలు కూడా మార్కెట్‌లో పెరిగిన పోటీను తట్టుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓలా కంపెనీ ఎస్‌ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.15,000 దాకా విలువైన ఆఫర్లను ప్రకటించింది. ‘ఓలా ఎలక్ట్రిక్ రష్ ‘ ప్రచారంలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు ఇంకా ఎక్స్చేంజ్ బోనస్లు అందిస్తుంది. అయితే ప్రత్యేక ఆఫర్లు జూన్ 26, 2024 దాకా మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఓలా ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే ఈ రెండు రోజుల్లో కొనుక్కోవడం మంచిది. ఈ నేపథ్యంలో ఓలా ఎస్‌ 1 స్కూటర్లపై ఆఫర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌  స్కూటర్‌పై 5,000 ఫ్లాట్ తగ్గింపుతో పాటు క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై పై 5,000 దాకా క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసినప్పటికీ, 35,000 దాకా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ముఖ్యంగా ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి రుణాల పై 75,000 దాకా క్యాష్ బ్యాక్‌ను ఎంచుకోవచ్చు.ఇక ఈ స్కూటర్‌ ధర 89,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.ఓలా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో మోడల్‌ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ.2,999 విలువైన ఓలా కేర్ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఫ్రీగా అందిస్తోంది. ప్యాకేజీలో భాగంగా వార్షిక సమగ్ర నిర్ధారణ, సర్వీస్ పికప్ డ్రాప్, వినియోగ వస్తువులు, దొంగతనం ఇంకా రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో సహా ఉచిత సేవలను కూడా ఓలా కస్టమర్లు పొందవచ్చు. ఇంకా అలాగే ఓలా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌ 1 ప్రో స్కూటర్లపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై 75,000 దాకా క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ ధర వచ్చేసి రూ.1.05 లక్షలు కాగా, ఎస్‌ 1 ప్రో ధర వచ్చేసి రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 49 శాతం మార్కెట్ వాటాతో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అగ్రగామి సంస్థగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: