మారుతీ సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ ఎప్పుడంటే?

frame మారుతీ సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ ఎప్పుడంటే?

Purushottham Vinay

మారుతి సుజుకీ కార్లకు దేశంలో ఎంతో ప్రజాదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలకు ప్రస్తుతం డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వారు ఈ కార్లని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి విడుదల కానున్న మారుతీ సుజుకి ఈవీక్స్ పై ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని ప్రత్యేకతలు ఇంకా అలాగే ఇతర వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మారుతీ సుజుకీ ఈవీక్స్ (ఎలక్ట్రిక్) కారును ఇప్పటికే చాలా ఆటో షోలలో చాలా సార్లు ప్రదర్శించారు. మారుతీ సుజుకీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ కూడా ఇదే కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కారు సంచలనం రేపుతుందని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ కొత్త కారుకు ఎస్కుడో అని పేరు పెట్టవచ్చని జపనీస్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ అయిన హటేనా బ్లాగ్ తెలిపింది.


ఈ కారులో విభిన్న అవసరాలను తీర్చడానికి రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లను ఫిక్స్ చేశారు. ఒకటి 40 కేడబ్ల్యూహెచ్ ఇంకా రెండోది 60 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇక వాటిలో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనం మన దేశంలో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా కావాలనుకునే వారికి 60 కేడబ్ల్యూహెచ్ అనేది వీలుగా ఉంటుంది. ఇక ఈ కార్ అంతర్జాతీయ మార్కెట్లలో ఆధిపత్యం చెలాయిస్తుందని తెలుస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి సుజుకీ కంపెనీ తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముందుగా ఈ సుజుకి ఎస్కుడో (మారుతీ సుజుకీ ఈవీక్స్)తో రానుంది. ఇంకా అలాగే టయోటా మోటార్ కార్పొరేషన్‌తో కూడా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను బాగా అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే బ్యాటరీ, అభివృద్ధి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.సుజుకి ఎస్కుడో మన దేశంతో పాటు యూరోప్, జపాన్లలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. 2025 జనవరి నెలలో మన మార్కెట్ కు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కారుకు ఆదరణ అనేది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: