బ్రేకింగ్ : వలస కూలీలను కన్నబిడ్డల్లా చూసుకున్న ఘనత సీఎం కేసీఆర్ దే : మంత్రి మల్లారెడ్డి

Edari Rama Krishna
దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి లాక్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. అప్పటి వరకు వివిధ ప్రదేశాల్లో పనుల కోసం వచ్చిన వలస కూలీలు నానా కష్టాలు పడటం మొదలైంది.  చేయడానికి పనులు లేక.. సరైన వసతులు లేక.. బయటకు రాలేక నరక యాతన అనుభవించారు. ఆ సమయంలో వలసకూలీలను తమ రాష్ట్ర బిడ్డలుగా చూసుకుంటామని... ఏ ఒక్కరూ పస్తులుండకుండా చర్యలు తీసుకున్న ఏకైన ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్న ఏకైన రాష్ట్రం తెలంగాణే అని మంత్రి స్పష్టం చేశారు. మూడు లక్షలకు పైగా వలస కార్మికులను గుర్తించి ప్రతీ ఒక్కరికి నెలకు సరిపడా... నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు. లాక్డౌన్ సడలించే వరకు జాగ్రత్తగా చూసుకుని... అనంతరం ప్రత్యేక వాహనాలతో స్వస్థలాలకు తరలించామని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: