రూ.2 లక్షలతో ఆడిక్యూ-5 కారు?
నవంబరు నెలలో విడుదల కానున్న ఆడిక్యూ-5 కార్ల బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డీలర్లవద్ద రూ.2 లక్షలు చెల్లించి ఎవరైనా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. రెండు లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో వస్తున్న 249 హార్స్ పవర్ శక్తిని విడుదల చేస్తుంది. మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులుంటాయి. అందులో రెండు ఎయిర్ బ్యాగులు వెనక కూడా ఇచ్చారు. అసిస్ట్, కంఫర్ట్ కీ లాంటి అత్యాధునిక ఫీచర్లతో తన విక్రయాలు పెంచుకునేందుకు ఆడీ ప్రయత్నిస్తోంది. వాహనాలన్నీ బీఎస్-6లోకి మారడంతో క్యూ-3, క్యూ-7తోపాటు క్యూ-5 కార్ల విక్రయాలను నిలిపివేసింది. గత సంవత్సరం ఆడీ 1639 యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది ఆగస్టు వరకు విక్రయాల్లో 115 శాతం వృద్ధిని నమోదు చేసింది. 370 ఎన్ ఎం టార్క్ వద్ద 249 అశ్వకశక్తి సామర్థ్యాన్ని విడుదల చేస్తోంది. ఆడి కంపెనీ కార్ల కోసం దేశవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉండటం, కంపెనీ తన ఉత్పత్తులను పరిమితం చేయడంవల్ల సరఫరాకు, ఉత్పత్తికి అంతరం తలెత్తుతోంది. దీన్ని నివారించడానికే ముందస్తు బుకింగ్స్ నమోదు చేసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.