తెలంగాణలో దీపావళి నిన్ననే జరిగిందంటూ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల విజయం సాధించిన ఈటెల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ....కుట్ర దారుడు కుట్రల్లోనే నాశనం అవుతాడంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నీచపు, చిల్లర పనులు చేశాడని...ఆయన బొమ్మ, ఆయన గుర్తు మీదనే గెలుస్తారు అన్న అహంకారం ఉందని అన్నారు. తమకే ఓట్లు వేయాలని పసుపు బియ్యం తో ప్రమాణం చేయించుకున్నారంటూ ఈటెల సంచలన ఆరోపణలు చేశారు.
దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే నిలబడ్డారంటూ ఈటెల షాకింగ్ కామెంట్లు చేశారు. డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారని....దమ్ముంటే మామా అల్లుడు పోటీ చేయాలని ఈటెల సవాల్ విసిరారు. తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగిందని ఈటెల వ్యాక్యానించారు. అంతే కాకుండా ఇది హుజురాబాద్ ప్రజల విజయమని నా చర్మం వలిచి హుజురాబాద్ ప్రజలకు చెప్పులు కుట్టించినా రుణం తీసుకోలేనని వ్యాఖ్యానించారు.