కరోనా : విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు పాజిటివ్
డాక్టర్లు, నిపుణులు అందరూ కరోనా జాగ్రత్తల గురించి చెబుతున్నారు. ఎవ్వరూ కూడా నెగ్లిట్ చేయకూడదు. మరొక సారి నేను చెబుతున్నాను. దయచేసి అందరూ మాస్క్‌లు ధరించుకోండి. అవసరం అయితే తప్ప బయటికి రాకండి. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇకపోతే ప్రియాంక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రంలో తెలుగు తెరకు పరియమైంది. ఈ చిత్రం విజయం సాధించడంతో ఈ అమ్ముడు మంచి అవకాశాలనే అందుకుంది. తిమ్మరుసు ఎస్.ఆర్.కల్యాణమండపం లాంటి చిత్రాలలో దగ్గర అయింది. తాజాగా ప్రియాంక మరొక రెండు సినిమాలలో నటిస్తోంది. ప్రియాంక కోవిడ్ బారిన పడిందని తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.