మోదీ ప్రధాని అయ్యాక.. కాశ్మీర్‌లో ఇంత మార్పా?

Chakravarthi Kalyan
ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక జమ్మూకాశ్మీర్ లో చాలా మార్పులు వచ్చాయట. ఉగ్రదాడులు 168 శాతం తగ్గాయట. దేశంలో మావోయిస్టు దాడులు 265 శాతం మేర తగ్గుముఖం పట్టిందట. మోదీ ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైందట. కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పిన సమాధానం ఇది. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ , 2019లో పుల్వామా ఘటన తర్వాత చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల వంటి నిర్ణయాత్మక చర్యలు కచ్చితమైన ఫలితాలు ఇచ్చాయట. 2014 నుంచి దేశంలో తిరుగుబాట్ల వల్ల చెలరేగే హింస కూడా 80శాతం తగ్గిందట.

పౌరమరణాలు కూడా 89శాతం తగ్గాయట. 6వేల మంది ఉగ్రవాదులు లొంగిపోయారని కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్   ఠాకూర్ తెలిపారు . ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన కేసుల్లో  94 శాతం మందికి శిక్ష పడుతోందని కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్   ఠాకూర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: