కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఇచ్చేస్తారట?
కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి హామీ ఇస్తే దానిని వందకు వంద శాతం అమలు చేసి తీరతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సరూర్ నగర్ వేదికగా సోనియా గాంధీ ప్రకటించే యువ డిక్లరేషన్ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. యాభై రోజులకుపైగా పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో పర్యటించారు.