బిజినెస్: ఎస్బిఐలో ఈ అకౌంట్ తెరిస్తే కోటీశ్వరులు అవ్వచ్చు.. ఎలా అంటే?

Durga Writes

అవునండీ.. దేశి అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో ఈ అకౌంట్ తెరిస్తే కోటీశ్వరులు అవ్వచ్చు. ఎలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. ఈ బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుండి రుణాల వరకు ఎన్నో సర్వీసులు ఆఫర్ ఇస్తుంది. ఇంకా అందులోని భాగంగానే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సేవలు కూడా. 

 

అయితే పీపీఎఫ్ అకౌంట్ ను ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి ఓపెన్ చెయ్యచ్చు. ఇంకా ఈ పీపీఎఫ్ అకౌంట్ ను దీర్ఘకాల ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ గా చెప్పచ్చు. అయితే ఈ అకౌంట్ లో డబ్బులు పెట్టడం వల్ల ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. అంతేకాదు మీరు పెట్టిన డబ్బుకు ఎక్కువ వడ్డీ రేటు కూడా లభిస్తుంది. 

 

ఇన్ని లాభాలు మాత్రమే కాదు మెచ్యూరిటీ సమయంలో కళ్లుచెదిరే లాభాలు కూడా వస్తాయి. అయితే ఈ పీపీఎఫ్ అకౌంట్ ను పోస్ట్ ఆఫీస్ లో తెరవచ్చు. ఇంకా ఈ పీపీఎఫ్ అకౌంట్ పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఇంకా ఈ పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అయితే ఈ అకౌంట్ ను తెరవాలి అంటే ఫామ్ ఏ,  నామినేషన్ ఫామ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అవసరం. ఒక పీపీఎఫ్ అకౌంట్ లో సంవత్సరానికి లక్ష 50 వేల రూపాయిల వరకు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. 

 

ఇంకా ఇందులో కనీసం 500 రూపాయిలు డిపాజిట్ చెయ్యాలి. ప్రతి నెల ఇందులో కొంత ఇన్వెస్ట్ చెయ్యాలి. ఈ డబ్బును మెచూరిటీ కంటే ముందుగా కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ అకౌంట్ తెరిచి 7 ఏళ్ళు పూర్తవుతూనే అలా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంకా డబ్బులు కూడా పూర్తిగా తీసుకునే అవకాశం లేదు. కాకపోతే నెలకు 12,500 రూపాయిలు ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత దాదాపు కోటి రూపాయిల లభిస్తాయి. మరి ఇంకేందుకు ఆలస్యం వెంతంటే పీపీఎఫ్ అకౌంట్ తెరవండి.. కోటీశ్వరులు అవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: