సుఖమైన నిద్రకు చిట్కాలు..!!
హాయిగా నిద్రపోవాలంటే ఈ ఆహారం తీసుకోండి :
రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు , రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
బార్లీ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా నిద్ర పడుతుంది.
అరటి పళ్లల్లో మెగ్నీషియం, పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి.
నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగినా ఫలితం ఉంటుంది. ఫ్లాక్స్ విత్తనాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఆందోళన, ఒత్తిడి, నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే ఇన్‌సోమ్నియా (నిద్రలేమి)ని పోగొడతాయి.
సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.
శరీరంలో షుగర్ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.