ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి..!

Edari Rama Krishna

ఈ మద్య కాలంలో మనం తింటున్న ఆహార పదార్థాలు అన్ని దాదాపు కెమికల్ రూపంలో ఉంటున్నవే..ముఖ్యంగా జంగ్ ఫుడ్ తినడం వల్ల కలిగే అనర్ధాలు అంతా ఇంతా కాదు. మనం ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్ని పొరపాట్ల వల్ల అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. అయితే మనం ఇంట్లో ఉంటూనే చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని సూత్రాలు మీకోసం..

భోజనం : మనం తినే భోజనమే మనకు అమృతం. అదే మనకు జీవితానికి శక్తిప్రదాయిని, నిర్ణీతవేళలో పుష్టికరమైన భోజనం తీసుకోవాలి. తీసుకునే ఆహారం శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేదిగా వుండాలి. అమితమైన భోజనం లేదా అతి తక్కువ భోజనం శరీరానికి అంత మంచిదికాదు.


నిద్ర : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్రకూడా ఎంతో అవసరం నిద్రలేమి... జబ్బులకు నిలయంలాంటిది. అతి నిద్ర అలసత్వానికి దారితీస్తుంది. వరీరానికి ఎంత నిద్ర అవసరమో అంతే నిద్రపోవాలి. రాత్రివేళ త్వరగా పడుకుని వేకువజామునే నిద్రలేవడం మంచిది.


వ్యాయామం : ఉదయం వ్యాయామం కొరకు సమయం కేటాయించాలి. నచ్చిన వ్యాయామం ఏదైనా చేయవచ్చు. ఉరుకులపరుగుల జీవితంలో పడిపోయి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు.


దుర్వసనాలు : సిగరెట్లు, పొగాకు, మధ్యం, తదితరాలు తీసుకోవడం అలవాటువుంటే దానిని తప్పకుండా మానుకోవాలి. వయసుకు తగ్గట్టు కొన్ని దురలవాట్ అలవడుతాయి. వ్యసనాలబారినపడితే ఆరోగ్యం పాడవడం ఖాయం.


హద్దు : జీవితంలో ప్రతి పని మర్యాదపూర్వకంగా చేయాలి. ఏ పనిలోనూ శృతిమించకుండా ఉండాలి. అతి సర్వత్ర వర్చయేత్, మీ జీవితంలో మీరు కొన్ని హద్దులు ఏర్పరచుకోవాలి. ఆ హద్దులవలన ఆరోగ్యం మీ చేతుల్లోనే వుంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: