వేసవిలో చల్లగా హాయిగా ఎలా ఉండాలో... అంటే దుస్తులు, మేకప్, ఆహారం, యాక్ససరీస్ తదితరాలకు సంబంధించిన ఎంపిక ఎలా ఉండాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం...
యాక్ససరీస్ :
సన్నటి వైన్ లు... యాంటిక్ బుక్ వున్న ఆభరణాలు మేలు, స్పోర్టీలుక్... పెద్ద ఫ్రేములన్న చలువ కళ్లద్దాలు ఈ సీజన్ ఫ్యాషన్.
పాదరక్షలు:
ఫ్లాట్ చెప్పులు, మంచి స్ట్రాప్ లు ఉన్న శాండిల్స్ వేసవికి ప్రత్యేకం.
బ్యాగులు :
నాణ్యమైన దళసరి నూలు అల్లిక బ్యాగులు, జనపనార, మేష్ బ్యాగులు బాగుంటాయి. సాధ్యమైనంత వరకూ లెదర్ ను ఈ సీజన్ లో వాడకండి.
ఫెర్ ఫ్యామ్ లు :
పండ్ల సువాసనలున్న ఫెర్ ఫ్యూమ్ లు, బాడీ డియోడరెంట్ లు ఉల్లాసాన్నిస్తాయి.
వేసవి పెట్టుబడులు :
ఎదైనా ఓ స్మిమ్మింగ్ ఫూల్ లో సభ్యత్వం తీసుకోండి. మీకు అనువుగా ఉండే సమయంలో హాయిగా ఈతకొట్టి వస్తే బావుంటుందో తెలసా! వేసవిలో ప్రత్యేక ఫ్యాకేజీలు ప్రకటిస్తారు. కొన్ని బ్యూటీ పార్లర్లవారు. వాటిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి. హాయిగా రిలాక్స్ అవండి.
మంచి నీరు :
అందంగా మీ అొవసరాలకు తగినట్లుగా ఉండే కొత్త కూజా, కుండను తప్పనిసరిగా కొనుక్కోండి. కూజా అంటే చిన్నచూపు వద్దు. చల్లని మంచినీరు ఎంతో సేదదీరుస్తాయి. ఐస్ వేసిన నీళ్ల మూలంగా కొందరిలో గొంతుకు వచ్చే ఇబ్బందులలే కుండనీళ్లకి ఉండవు. అందుకే కుండనీరు చాలా శ్రేష్ఠం.
దుస్తులు :
లేత రంగులే ఈ సీజన్ లో ఫ్యాషన్, నిమ్మపండురంగు, లేత చిగురాకుపచ్చ బేబీపింక్, ఆకాశరంగులు కంటికి ఎంతో ఆహ్లాదాన్నిస్తారు. పూల ప్రింట్ లు నేటి ఫ్యాషన్ జిప్సీ స్కర్టులు, బ్యాక్ లెస్ టాప్ లు వేసవిలో మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచుతాయి. నాణ్యమైన నూలు వస్త్రాలతో కలిగే స్వాంతనే వేరు.
హెయిర్ స్టయిల్ :
జుట్టంతా కలిపి ఒకే అందమైన క్లిప్ తో మెడమీదగా ముడివేసుకోవడం... లేదంటే లేయర్స్... లేయర్స్ గా జుట్టును కత్తిరించుకోవడం ఈ సీజన్ ఫ్యాషన్.
మరింత సమాచారం తెలుసుకోండి: