అందమే కాదు- ఆరోగ్యానికి మంచిది.

Durga
గోర్లు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా, గోళ్ళపై పసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి. బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచూ చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. గిన్నెలు కడగడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చేసేటప్పుడు గ్లవ్స్ ధరించాలి. గోళ్లు కొరకడం, గోళ్లతో డబ్బాల మూతలు తీసే అలవాటు మానుకోవాలి. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులు వాడకూడదు. దానివల్ల గోళ్ళు పాలిపోయి నిర్జీవంగా తయారవుతాయి. పనులు పూర్తయిన తర్వాత శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత గోళ్ళకు కూడా పట్టెలా మాయిశ్చరైయిజర్ రాయాలి. వారానికొకసారి గోళ్ళకున్న త పాలిష్ తుడిచేసి గోళ్ళను ట్రిమ్ చేయాలి. నెయిల్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెతో గోళ్ళను మర్ధన చేయాలి. పాలిష్ వేసుకోని వాళ్ళు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోళ్ళకి లోషన్ కాని, మాయిశ్చరైయిజర్ కాని రాయాలి. గోళ్ళు పెళుసుబారి విరుగుతుంటే ‘ఇ’ విటమిన్ ఆయిలతోో మర్థన చేయాలి. ఒకరు వాడిన నెయిల్ కట్టర్ మరొకరు వాడకపోవడమే మంచిది. వాడాల్సి వస్తే 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచి వాడాలి. వారానికొకసారి గోళ్ళను నీట్ గా కట్ చేసుకోవాలి. ఇది అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. నెయిల్ పాలిష వేసిన తరువాత గోరు మీద మాత్రమే కాకుండా కొద్దిగా చర్మానికి కూడా అంటుతుంది. దీనిని వెంటనే నెయిల్ పాలిష్ రిమూవర్ తో తుడిచేయాలి. నెయిల్ పాలిష్ పెచ్చులుగా రాలిపోకుండా ఎక్కువ రోజులు నిలవాలంటే పలుచగా రెండు మూడు కోటింగులు వేయాలి. ఒక కోటింగ్ పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మరో కోటింగ్ వేయాలి. పాలిష్ వేయడానని గోరు మొదట్లో ప్రారంభించి చివరి వరకూ ఒకటే స్ట్రోక్ తో పూర్తి చేయాలి. ఇలా చేయటం వలన పాలిష్ అందంగా ఉంటుంది. గోళ్ళు నిర్జీవంగా, పెళుసుబారినట్లనిపిస్తే గోరు మీద రసం పిండేసిన నిమ్మచెక్కతో రుద్దితే గోర్లు అందాన్ని సంతరించుకుంటాయి. గోళ్ళు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమూన ఆకృతిలో ఉండాలన్నా నెలకొకసారైనా మోనిక్యూర్ చేయాలి. కొంత టైం కేటాయిస్తే మోనిక్యూర్ ఇంట్లోనే చేసుకోవచ్చు.   గోరువెచ్చని నీటిలో నాలుగైదు చుక్కలు షాంపూ కానీ, కొంచెం సబ్బు కానీ వేసి చేతులను 10 నిమిషాలు నాననివ్వాలి. నీటిలో ముంచి తీశాక చేతులను, వేళ్ళను, గోళ్ళను మెత్తటి బ్రెష్ తో సున్నితంగా రుద్ది కడగాలి.  గోరుని షేవ్ చేసేటప్పుడు మొదటగా మధ్యలో కట్ చేయాలి. తర్వాత పక్కల కట్ చేయాలి. మరీ పొడవుగా ఉన్నపుడు ఒకేసారి లోపలికి కట్ చేయకూడదు. కొద్దికొద్దిగా కట్ చేస్తూ పొట్టిగా చేయాలి. షేవ్ చేసిన తర్వాత గోరును ఫైలర్ తో రుద్దాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: