ఇమేజ్ పర్ఫెక్టుగా ఉంటె ఎన్ని రకాల దుస్తులైనా ధరించవచ్చు మీలో ఎంతమంది పర్ఫెక్టు ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ ఉండే ఉంటారు.? నిజానికి మనలో చాలామంది కొద్దిపాటి లోపాలతో భాదపడేవారే, లావుగా, పొట్టి, సన్నగా, ఇవన్నీ మనం ధరించే దుస్తులతో కవర్ అవ్వాలి. ఆ విధంగా దుస్తులు మన డిజైన్ చేయించుకోవాలి. చిన్నచిన్న మార్పలతో మీ ఇమేజ్లో ఎంత మార్పు వస్తుందో మీకే ఆశ్చర్యంగా ఉంటుంది.
పొడుగ్గా, సన్నగా ఉంటే : అడ్డ చారలున్న దుస్తులు ధరిస్తే లావుగా కన్పించే అవకాశం ఉంది. అలాగే డైగోనల్ లైన్ ఉన్న దుస్తులు ధరిస్తే సన్నటి వాళ్లు కొద్దిగా లావుగా కన్పిస్తారు. లావుగా కన్పించాలనుకుంటేనే పైన చెప్పింది ఫాలో అవ్వాలి, లేదంటే నిలువు చారలున్న దుస్తులు ధరించడం మంచిది.
నడుం సన్నగా కన్పించాలనుకుంటే సన్నటి మెటల్ బెల్డ్ వాడాలి. పైనుంచి కింది వకరకూ ఒకే రంగు దుస్తులు ధరిస్తే స్లిమ్ గా కనిపించే అవకాశం ఉంది. ఇందులోనే కొంచెం కాంట్రాస్ట్ లుక్ కన్పించాలి.
ఉదాహరణకు:
సల్వార్ కమీజ్ వేసుకుంటే బాగుంటుంది. సల్వార్ కమీజు తెలుపురంగులో ఉంటే దుపట్టా వేరే రంగులో ఉంటే బాగుంటుంది. సల్వార్ కమీజు తెలపురంగులో ఉంటే పైన వేసుకునే దుపట్టా బ్లాక్ కలర్ అయితే మరింత స్లిమ్ గా కన్పిస్తారు.
ప్రయత్నించి చూడండి
మరింత సమాచారం తెలుసుకోండి: