ఆరోగ్యకరమైన ఆహారం :
మీరు ఒక ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యకరమైన చర్మం పొందడం కోసం అవసరమైన మరియు ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మీ శరీరానికి మరియు చర్మ సౌందర్యానికి మంచి పునాది వంటిది.
రోజు వ్యాయామం:
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం మొత్తం, మరియు చర్మకణాలకు రక్త ప్రసరణ బాగా జరిగి మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా మెరిసే చర్మంతో మెరిసిపోతుంటారు.
మంచి ఫేష్ వాష్ ను కొనుక్కోండి:
ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి ఒక మంచి ఫేష్ వాష్ ను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఫేస్ వాష్ కూడా అది మీ చర్మ తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.
మాయిశ్చరైజర్:
అందమైన చర్మ ఎల్లప్పుడు మాయిశ్చరైజ్ ఉంటుంది. పొడి చర్మం మిమ్మల్ని ఎప్పుడు డల్ గా మరియు ముడుతలతో ఉండేలా చేస్తుంది. కాబట్టి ఒక మంచి నాణ్యత కలిగిన మాయిశ్చరైజర్ ను మీ ఎంపిక చేసుకొని ప్రతి రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా అవసరం.
రోజు మార్చి రోజు స్క్రబ్ :
ఇలా రోజు విడిచి రోజు స్ర్కబ్బింగ్ చేయడం వల్ల చర్మంలో పేరుకు పోయిని మురికిని తొలగించడంతో పాటు డెడ్ స్కిన్ తొలగిస్తుంది. కాబట్టి ఈ తేలికపాటు స్ర్కబ్బింగ్ ను ఉపయోగించి అందంగా తయారవ్వండి.
బ్యూటీ ట్రీట్మెంట్ :
అందంగా కనబడటం కోసం బ్యూటీ పార్లర్లకు తరచూ వెళుతూ.. బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకోవడం మీ చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి సాధ్యం అయినంత వరకూ బ్యూటీ ట్రీట్మెంట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. సహజ పద్దతులను ఇంట్లోనే ప్రయత్నించండి. దాంతో దీర్ఘకాల సౌందర్యాన్ని పొందగలుగుతారు.
సన్ బ్లాక్ తో:
సూర్య కిరణాలు మీ చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తాయి. సూర్యకిరణాల్లో యూవీ కిరణాలు చర్మం మీద పడటం వల్ల చర్మం కమలడం మరియు నల్లగా మారడం వంటి సమస్య ఎదుర్కొంటుంటాం కాబట్టి మంచి క్వాలీటి ఉన్న సన్ స్ర్కీన్ లోషన్ ఉపయోగించడం వల్ల సూర్య కిరణాల నుండి ఏర్పడే హానిని తగ్గిస్తుంది. మన చర్మానికి రక్షణ కల్పిస్తుంది.
నేచురల్ గా ఉండాలి:
సాధ్యమైనంత వరకూ సహజంగా నేచురల్ గా ఉండటానికి ప్రయత్నించడం వల్ల మరింత అందగా కనబడుతారు. దానికి తోడు అతి తక్కువ మేకప్ కు ప్రాధాన్యత ఇవ్వండి.
మేకప్ తో నిద్రపోకండి:
నిద్రకుపోవడానికి ముందు మీరు వేసుకొన్న మేకప్ ను పూర్తిగా తొలగించాలి. మీరు నిద్రించే సమయంలో మీ చర్మానికి ఊపిరి సలపనియ్యండి. విశ్రాంతిని అందించండి.
ఉత్పత్తులు :
ఎక్స్ పైర్డ్ ఉత్పత్తులు మరియు లో క్వాలిటీ ఉత్పత్తులను ఉపయోగించకండి. మీ చర్మ కంటే ఏదీ విలువైనది కాదు. కాబట్టి మేలైన బ్యూటీ ప్రొడక్ట్స్ కు ప్రాధాన్యతను ఇవ్వండి. వాటి లేబుల్స్ ను క్షుణంగా చదివిన తర్వాతే వాటిని వాడటానికి ప్రయత్నించండి.
మరింత సమాచారం తెలుసుకోండి: