ఉల్లిపాయతో జుట్టు ఊడే సమస్య చెక్ పెట్టండి
సాధారణంగా ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలడం, బట్టతల ఈ రెండు ఇప్పుడు అందరికి ప్రధానమైన సమస్యలు..అయితే ఈ సమస్యలకోసం చాలా మంది అనేకరకాల రసాయనిక మందులు షాంపూలు..వాడుతూ ఉంటారు. కానీ జుట్టు రాలిపోవడం ఆగకపోవడం మాత్రమే కాదు స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది..అందుకే సహజసిద్దమైన పద్దతులు ఉపయోగించడం చాలా ఉత్తమం అని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు..
జుట్టు ఊడిపోయే వాళ్ళు ముఖ్యంగా గమనించవలసినది ఒక్కటే..జుట్టు ఊడిపోయిన తరువాత దాని కుదుళ్ళు కనుకా పట్టుకుని చుస్తే ఒక జిగురులాంటి పదార్ధం అంటుకుంటుంది..అయితే జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్ళకి ఈ జిగురులాంటి పదార్ధం ఉండదు..అదే జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైన సమస్య. ఈ సమస్య పోయి మరలా జుట్టు ధృడంగా ఉండాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి..
మీ జుట్టు ఊడిపోకుండా ధృడంగా ఉండాలి అంటే ఉల్లిపాయ రసం మాస్క్ మాత్రం తప్పకుండ చేయాల్సిందే.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే..ఉల్లిపాయలో జుట్టు రాలకుండా చేసే సల్ఫర్ ప్రోటీన్స్ ఉంటాయి..జుట్టు రాలిపోవడానికి అతిపెద్ద రీజన్ సల్ఫర్ లేకపోవడం వల్లనే..అందుకే సల్ఫర్ కంటెంట్ ఎక్కవగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం చాల ముఖ్యమైన విషయం..ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ యొక్క కరిగే రూపమైన మిథైల్ సఫోనీల్ మీథేన్ కెరాటిన్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది.ఈ కెరాటిన్ జుట్టు పెరగటంలో సహాయపడుతుంది..ఉల్లిలో బ్యాక్టీరియా వ్యతిరేక గుణాలు తల మీద ఉన్న ఈస్ట్ తీవ్రతని విచ్ఛిన్నం చేస్తాయి..చుండ్రుని పోగోడుతాయి..దీంతో జుట్టు ఎంతో ధృడంగా ఉంటుంది.. జుట్టు రాలే సమస్య పోతుంది.