ముఖంపై రంద్రాలు ఇలా తొలగించుకోండి!
యుక్తవయస్సు లో ప్రతి ఒక్కరికీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మొటిమలు రావడం అవి మానిపోగానే వాటి ప్రదేశంలో రంద్రాలు పడ్డట్లు కనిపించడం ఎంతో మానసిక వ్యథను కల్పిస్తుంది. అయితే వీటి కోసం ఎన్నో రకాల ట్రీట్ మెంట్స్ తీసుకుంటారు..కానీ ఫలితం శూన్యం. అయితే ఇలాంటి వాటికి ఆయుర్వేదంతో గాని..కొన్ని మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలతో కూడా నయం చేసుకోవచ్చు.కావల్సిందల్లా సరైన పద్దతిలో తీసుకోవడం.
చిడ్డు చర్మం కలిగిన వారి ముఖం మీద రంద్రాలు చాలా పెద్దవిగా కన్పిస్తాయి.రంద్రాలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేయటానికి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఒక చిన్న టమోటాను రసంగా తీసి, దానిలో 2 నుంచి 4 చుక్కల నిమ్మరసం కలపాలి.
ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ని ముంచి ముఖం మీద రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. గుడ్డు తెల్లసొనలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక బౌల్ లో నీటిని పోసి దానిలో బాదం వేసి రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు నానిన బాదంను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.