“వేసవి జిడ్డు”...తొలగించే ఫేస్ ప్యాక్స్...!!!

NCR

వేసవి కాలం వచ్చిందంటే చాలు జిడ్డు చర్మ తత్వం ఉండే వాళ్ళు తెగ భయపడిపోతారు. సహజంగానే వేసవిలో చర్మం చెమటతో జిడ్డుగా ఉంటూ ఇబ్బంది పెడుతుంది. అలాంటిది జిడ్డు చర్మం వారికి మరింత ఇబ్బంది కలుగుతుంది. దాంతో చేతి రుమాళ్ళు తడిచిపోతూ  ఉంటాయి. స్పేర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు ముఖం నుంచీ జిడ్డు కారడం వలన చెమట వాసన కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే

 

ఈ రకమైన పరిస్థితులని నుంచీ ముఖ్యంగా వేసవిలో జిడ్డు కారే చర్మం నుంచీ తప్పించుకోవాలంటే కొన్ని పేస్ ప్యాక్స్ వాడక తప్పదు. పూర్వం నుంచీ కూడా వేసవి కాలంలో చర్మ సంరక్షణకి కొన్ని రకాల పద్దతుల ద్వారా చర్మానికి లేపనాలు పట్టించే వారు. ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచీ వేసవి జిడ్డు బారినుంచీ తప్పించుకునే కొన్ని పేస్ ప్యాక్స్ ఏమి ఉన్నాయో చూద్దాం..

 

ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ లో రెండు స్పూన్స్ నిమ్మరసం కలిపి దాన్ని ముఖానికి పట్టించి కొన్ని నిమిషాల పాటు వేళ్ళతో ముఖంపై రుద్దుతూ ఉండాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటిని ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మంలో అధికంగా ఉన్న జిడ్డు తొలగి పోతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా రెండు రోజులకి ఒక సారి చేసుకుంటే ముఖానికి మొటిమలు వచ్చే అవకాశం కూడా పూర్తిగా తగ్గిపోతుంది.

 

ఒక స్పూన్ శనగపిండి తీసుకుని అందులో ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన కలిపి దాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరాకా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగితే ముఖం పై జిడ్డు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండాలి.

 

రెండు టీస్పూన్స్ టమాటా గుజ్జు తీసుకని అందులో అరస్పూన్  పాలపొడి పట్టించి 15 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుని జిడ్డుని పోగొట్టుకోవచ్చు. ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవచ్చు.అలాగే మంచి గంధం చెక్కని తీసుకుని సానపై రుద్ది ముద్దగా  వచ్చిన గంధాన్ని ముఖానికి పట్టిస్తే జిడ్డు తొలగి పోయి చర్మ కాంతివంతంగా తయారవుతుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: