ముఖానికి "పెరుగుతో ఫేస్ ప్యాక్"....వారానికి రెండు సార్లు..!!!

NCR

అందమైన చర్మం, ముఖానికి మెరుపు ఎవరు కావాలని కోరుకోరు. కానీ మనం తీసుకునే ఆహార లోపంలో కానీ, చర్మానికి హాని కలిగించే పదార్ధాలు అతిగా తినడం వలన కానీ, కాలుష్య కారణాలు, ఇలా అనేక కారణాల వలన చర్మం పాడవుతుందని చెప్పడంలో సదేహం లేదు. మరి అలా చర్మం పాడవకుండా, కాంతిని కోల్పోయిన చర్మం మళ్ళీ మెరుగయ్యి మంచి వచ్చస్సుని కలిగి ఉండాలంటే కొన్ని పద్దతులు పాటించక మానదు. అదీ కూడా సహజసిద్ద పద్దతులని అవలంభించడం ఎంతో మంచిది..ఆ సహజసిద్ద ప్రక్రియ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం.  

 

చాలా  మంది మహిళలు చర్మ సరక్షణ కోసం వేలకి వేలు ఖర్చులు చేస్తారు తీరా అన్నీ చేసిన తరువాత చర్మ రక్షణ పక్కన పడితే వారు వాడే రసాయనిక క్రీముల వలన చర్మ బక్షణ జరిగుతుంది. అలా కాకుండా మనకి ఇంట్లోనే దొరికే పదార్ధాలతో పేస్ ప్యాక్ చేసుకుని మెరుగైన ఫలితాలు పోడవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే స్వచ్చమైన పెరుగులో బ్యాక్టీరియా వ్యతిరేక, బ్లీచింగలక్షణాలు నిర్జీవంగా ఉన్న చర్మంపై అద్భుతాలు చేస్తాయి.

 

ఒక స్పూన్ పెరుగులో అర స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పేస్ ప్యాక్ ని వారంలో రెండు సార్లు ముఖానికి పట్టించడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.

 

రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులు తీసుకుని నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్టులా వాటిని చేసి పెరుగులో బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేసిన  అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేస్తూ ఉంటే ముఖానికి మంచి తేజస్సు వస్తుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: