"పాదాల పగుళ్ళు".. నాలుగురోజుల్లో మాయం..ఈ చిట్కా ఫాలో అవ్వండి..!!!

NCR

పాదాల పగుళ్ళు ఇది ఎక్కువగా ఆడవారిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్య చలికాలం అనేకాదు ఎటువంటి కాలంలో అయినా సరే ఇబ్బందులకి గురిచేస్తుంది. వేసవిలో ఈ పగుళ్ళు మరింతగా ఇబ్బంది పెడుతాయి. మ్ముఖ్యంగా మంచి నీళ్ళు తక్కువగా తీసుకునే వారికి ఈ సమస్య మరింత జటిలంగా తయారవుతుంది. దాంతో వారు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యకి చక్కని ఇంటి చిట్కా ఉపయోగించి కేవలం నాలుగు రోజుల్లో పగుళ్ళని దూరం చేయచ్చు.

 

పాదాల సంరక్షణకి ముఖ్యంగా ఉపయోగపడేవి నూనెలు. శనగ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె, ఇలా ఎలాంటి నూనెలు అయినా సరే పాదాల పగుళ్ళని మాయం చేస్తాయి. కానీ కావాల్సిందల్లా సరైన మర్దనా చేయడమే. ఆ పద్ధతిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

 

ముందుగా పాదాలను మురికి వదిలే వరకూ శుభ్రంగా కడగాలి. ఆ తరువాత నూనె రాసి మర్దనా చేసుకోవాలి. ఇలా చేసిన తరువాత పాదాలకి సాక్స్ లు వేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేయడం వలన మీ పాదాలు ఎంతో మృదువుగా సున్నితంగా తయారవుతాయి.  అలాగే బియ్యప్పిండి తో కూడా పగుళ్ళని దూరం చేసుకోవచ్చు. ఎలా అంటే..

 

బియ్యంపిండికి కొన్ని చుక్కల తేనే,యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ముద్దలా చేయాలి. ఆ తరువాత పాడాలని గోరువెచ్చని నీటిలో కలిపి అరగంట నానబెట్టి ఆ తరువాత కలుపుకున్న మిశ్రమాన్ని రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన పాదాల పగుళ్ళలోకి మిశ్రమ చేరి మెల్లగా పగుళ్ళు మాయం అవుతాయి, మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: