పచ్చిపాలులో దూది ముంచి ముఖానికి అద్ది, సన్నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే మంచిఫలితం ఉంటుంది. పాలు, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ముఖానికి పట్టించి చన్నీటితో కడిగితే పొడిచర్మం ఎండిపోకుండా నిననిగలాడుతుంది. అర టీస్పూన్ ఆలీవ్ ఆయిల్ లో రెండు మూడు చుక్కలు నిమ్మరసం, అర స్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఒక స్పూన్ మీగడలో రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. స్నానానికి 15 నిమిషాలు ముందు ముఖానికి పట్టించి స్నానం చేస్తే పొడిబారిన తనం పోయి, ముఖం కాంతివంతమవుతుంది. టమోటా ముక్కలతో ముక్కలతో ముఖాన్ని సుతిమెత్తగా మర్ధనా చేసినా మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డులోని తెల్ల సొనలో అర టీ స్పూన్ పాలపొడి అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం నిగనిగలాడుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: