కళ్ళకింద నల్లటి చారలు..తగ్గించే సింపుల్ చిట్కాలు...!!!
ముఖమెంతో అందంగా ఉంది కానీ
కళ్ళ కింద్ర నల్లటి మచ్చలు మాత్రం అందాన్ని తొక్కేస్తున్నాయి అంటూ తెగ భాద పడిపోతూ
ఉంటారు ఎంతో మంది. ఈ నల్లటి మచ్చలు
ఏర్పడటానికి సగానికి సగం మన స్వయంకృతాపరాధం ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేమి ఇందులో
ముఖ్యంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో అందరూ స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు
దాంతో నిద్ర లేమి ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్
ఏర్పడుతున్నారు. ఈ మచ్చలు పోవాలంటే చాలా సింపుల్ చిట్కాలు ఉన్నాయి.
టమోటా , పెరుగు( స్వచ్చమైన గేదె పెరుగు లేదా ఆవు పెరుగు ) ఈ రెండు నల్లటి మచ్చలని చిటెకలో పోగొట్టేస్తాయి. ముందుగా టమోటా గుజ్జు ని ఒక బౌల్ లోకి తీసుకోండి. అందులో కొంచం పెరుగు వేసి బాగా కలపాలి. ఈ గుజ్జుని కళ్ళ కింద రాసుకుని సుమారు 30 నిమిషాలు ఉంచుకుని తరువాత చల్లటి నీటితో కడిగితే ఫలితం కనిపిస్తుంది. అలాగే
కీర దోస , కలబంద తో కూడా ఈ డార్క్ సర్కిల్స్ పోగొట్టవచ్చు. కీర దోస గుజ్జు, కలబంద గుజ్జు తీసుకుని రెండిటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ళ క్రింద మర్దనా చేసి సుమారు 30 నిమిషాలు ఉంచాలి తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయగా తప్పకుండా మీ కళ్ళ కింద నల్లటి వలయాలు మాయమైపోతాయి.