ఆరెంజ్ తో అందం.. ఎలానో తెలుసా ?

Durga Writes

నారింజ పండ్లు రంగులు చూడగానే తినేయాలి అనిపిస్తుంటుంది.. జ్యూస్ చేసుకొని తాగేయాలి అనిపిస్తుంది. ఆలా అనిపిస్తేనే కదా అది కమల పండు అయ్యేది. ఆలా అనిపించడమే కాదు ఈ నారింజ పండు వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ఎన్నో విధాలుగా ఈ నారింజ పండు సహాయ పడుతుంది. అయితే ఆరోగ్యానికే ఇన్ని లాభాలు అందించిన ఈ నారింజ పండు అందానికి ఇంకెంత మేలు చేస్తుంది.. 

 

శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ నారింజ పండు అందానికి ఎంత సహాయపడుతుంది. అయితే ఈ సీజన్‌లో కాలుష్యం, పొగ కురులు, చర్మాన్ని దెబ్బతీస్తుంటాయి. ఫేస్‌ మా్‌స్కలతో కొంతమేర రక్షణ పొందినప్పటికీ ఆహారం, చర్మ సంరక్షణ పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకుంటే చలికాలంలోనూ తారలగ మెరిసిపోవచ్చు.. అయితే ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 


 
ఆరంజ్, తేనె, చిటికెడు పసుపు అన్నింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్ ల చెయ్యాలి. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసి 15 నుంచి 30 నిమిషాలు పెట్టి ఆతర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే అలసిపోయిన చర్మానికి పోషణ అంది తాజాగా తయారవుతుంది. 

 

ఆరంజ్ తొక్కను ఎండలో 24గంటలు ఎండబట్టి.. పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పౌడర్ లో 1టేబుల్ స్పూన్ పెరుగు కలిపి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత.. ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది. 

 

నారింజ తొక్క పొడి, గంధం, రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. బ్రష్ ఉపయోగించి ప్యాక్ అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ట్యాన్ తొలగించి మెరిసేలా చేస్తుంది. 

 

ఆరంజ్ పౌడర్, పాలమీగడ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ తో చర్మానికి 5 నిమిషాలు పాటు మసాజ్ చేసుకోవాలి. ఆతర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది. 

 

ఆరంజ్ తొక్కను సగానికి మడిచి ఆ జ్యూస్ ని ముఖంపై పిండాలి. స్మూత్ గా జ్యూస్ ని వేలితో ముఖమంతా స్ప్రెడ్ చేయాలి. కాస్త మంటగా అనిపించవచ్చు. కానీ 5 నిమిషాల అలానే వదిలేసి శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 

 

చూశారుగా.. ఆరెంజ్ తో ఎన్ని లాభాలు అనేది.. ఇంకెందుకు ఆలస్యం.. కుదిరితే ఆరెంజ్ ని తినండి.. లేదా ఫేస్ ప్యాక్ వేసుకోండి.. ఎలా చేసిన ఆరెంజ్ తింటే అందం మీ సొంతం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: