మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచనలను నిత్యనూతనంగా ఉంచుకోండి. ప్రతిరోజు కొద్దిసేపు వ్యాయామం చేయటం వల్ల మీ శరీరం పటుత్వం కలిగి, హుషారుగా ఉంటుంది. మనం నవ్వుతూ మన స్నేహితులను, బందువులను నవ్వించగిలిగిన వారికి మనసు హాయిగా ఉంటుంది. బాధ్యతలన్నీ మీవే అని కృంగిపోకుండా, మీరే విజేత అన్నట్లు ప్రవర్తించండి. జీవితాన్ని ఆనందంగా, పాజిటివ్ గా తీసుకోవాలి. నవ్వు నాలుగు విధాల లాభం, ఆరోగ్యం. సీరియస్ గా ఉండేవారిపట్ల ఎవరూ మక్కువ చూపరు. చిరునవ్వుతో తిరుగాడుతుండటం కూడా ఒక కళ. మనం ఎల్లవేళలా నిత్య నూతనంగా ఉండాలంటే మనసును చికాకులకు లోనుకాకుండా చూసుకోవాలి. ఒంటరితనాన్ని ఫీలవకుండా మీ సమస్యలను స్నేహతులతోనూ, ఆత్మీయులతోను పంచుకోండి. అప్పడు మనసులోని బరువు దిగి హాయిగా ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: