అందం: మెడపై నలుపు త‌గ్గ‌డానికి సూప‌ర్ టిప్స్‌..!

Kavya Nekkanti

చక్కటి రూపురేఖలతో చూడముచ్చటగా ఉన్నవారు కూడా మెడభాగం నల్లగా ఉంటే ఆందోళన చెందవలసిందే. చీర, చుడీదార్‌ ఏ అందమైన డ్రెస్‌ వేసుకున్నా మెడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. మ‌రియు ఏ ఖ‌రీదైనా ఆభ‌ర‌ణం వేసుకున్నా కూడా అందంగా క‌నిపించ‌లేము. వాస్త‌వానికి మెడ అందంగా పరిశుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖం అందం మీద కూడా పడుతుందని బ్యూటీగీషియన్లు అంటున్నారు.అందుకే ముఖంపై చర్మంలాగానే, మెడపై చర్మాన్ని కూడా సంరక్షించటం ముఖ్యం. మ‌రి మెడ‌పై న‌లుపు త‌గ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

నిమ్మరసం, పాలు కలిపిన మిశ్రమాన్ని మెడకు రాసి పావుగంట తరువాత సున్నిపిండితో కడుక్కోవాలి. ఈవిధంగా రోజూ చేస్తే మెడ నలుపు తగ్గుతుంది. అలాగే టమాటాను ఉడికించి,మెత్తగా పేస్టులా చేయాలి. తర్వాత వెనిగర్ ను వేసి కలపండి. దీన్ని మెడకి రాసి అర గంట‌ అలా వదిలేయండి.ఆ తర్వాత చల్లనీరుతో కడిగేయండి. ఈ చిట్కాను వారానికి మూడుసార్లు మంచి ఫలితాలు పొందొచ్చు. కొందరికి మెడ మడతలలో మురికి చేరి ఉంటుంది. 

 

సబ్బుతో ఎంత రుద్దినా పోదు. అటువంటి వారు పెరుగులో బియ్యప్పిండి కలిపి మెడకు రాసి ఐదు నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మెడ శుభ్రంగా ఉంటుంది. ఒక గిన్నెలో ఒక‌ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు అర‌ టీస్పూన్ ఆపిల్ సైడర్ వినెగార్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్ప‌డు మెడను శుభ్రం చేసుకుని ఈ ఫ్యాక్ వేసుకోవాలి. ఒక అర‌గంట ప్యాక్ డ్రై అయ్యే వరకూ ఉంచాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మెడ న‌లుపు త‌గ్గుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: