భారతీయ స్త్రీలు గాజులంటే ఎంతో మక్కువ ఇది మన సంప్రాదాయంలో భాగంకూడా. ముఖ్యంగా వివాహ సమయంలో చేతినిండా గాజులు ధరిస్తే ఆ అందమే వేరు. కాలేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఫాన్సీ బాంగిల్స్ కు ప్రాముఖ్యతనిస్తారు. ఇప్పుడైతే గాజులకన్నా బ్రాస్ లెట్స్ కే ప్రాధాన్యతనిస్తున్నారు.
బ్రాస్ లెట్స్ సంస్కృతి ఈజిప్ట్ లో మొదలైందంటారు. రాళ్లు పొదిగిన బ్రాస్ లేట్స్ ను ఈజిప్టీయన్స్ ధరిస్తే రోమన్లు పూర్తిగా బంగారంతో తయారు చేసిన బ్రేస్ లేట్స్ ధరించేవారు. ఇఫుడు మళ్లీ బ్రేస్లేట్స్ ధరించడం బాగా పాపులర్ అయింది. పంజాబీ పెళ్లికూతుళ్లు తెలుపు, ఎరుపు కలయికలో గాజులు ధరిస్తారు. బీహార్ పెళ్లికూతుళ్లు ఐరన్ గాజులు ధరిస్తారు.
మహరాష్ట్ర పెళ్లికూతుళ్లు చేతులు చూడండి వారు తప్పకుండా ఆకుపచ్చ గాజులు ధరిస్తారు. మందపాటి సిల్వర్ గాజుల మధ్య దంతాలలో రూపొందించిన గాజులు ధరించడం బంజరా స్త్రీల సంప్రాదాయం. పండగ వేళల్లో : హోలి పండగ వేళ గులాబీ, పసుపు రంగుల గాజులు ధరిస్తారు.
వరలక్ష్మి వ్రతం, సంక్రాంతి పండగలకు ఆఖు పచ్చ, మెరున్, ఎరుపు, గాజులు ధరిస్తారు. ఇక పెళ్లికూతుళ్లు ఆకు పచ్చ, ఎరుపు మట్టి గాజులతో పాటు బంగారు గాజులు కూడాధరిస్తారు. గాజుల గలగలలు వివాహానికి సరికొత్త శోభను అద్దుతాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: