అందం: లిప్ బామ్ పెదవులకి మాత్రమే కాదు.. ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు..!!
సాధారణంగా అందమైన, మృదువైన, ఎర్రని పెదవులు కోరుని వారుండరు. కానీ, పర్యావరణ కాలుష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం వల్ల పెదాలు డల్ అవ్వడం, డార్క్‌గా మారడం మరియు పగిలినట్టు అవ్వడం జరుగుతుంది. దీంతో చాలా మంది పెదవులు అందంగా ఉండేందుకు లిప్ బామ్ వాడుతుంటారు. అయితే లిప్ బామ్ పెదవులకి మాత్రమే కాదు.. ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కొంచెం లిప్ బామ్ ను క్యూ టిప్ పై వేసి, కళ్ళ మేకప్ ను తొలగించటానికి వాడండి.
మీ దగ్గర కళ్ల మేకప్ తొలగించే రిమూవర్ లేనప్పుడు లేదా దొరకనప్పుడు ఇలా చేసుకోవచ్చు. లిప్ బామ్ లో మింట్ వాసన వచ్చేవాటిని దీని కోసం వాడుకోవచ్చు. అలాగే ఎగురుతూ చిక్కుపడిపోయే జుట్టు మీ అందాన్నే దెబ్బతీస్తుంది. అలాగని మనలో అందరం హెయిర్ స్ప్రేలు వాడం. అందుకని కొంచెం లిప్ బామ్ వాడి జుట్టును సరిచేయండి. మీరు సాధారణ ఫ్లేవర్ లేని లిప్ బామ్ లను దీనికోసం వాడవచ్చు.
మీ దగ్గర్ ఏ లోషన్ లేనప్పుడు, కొంచెం లిప్ బాం ను చేతిలో తీసుకుని పొడిబారిన చేతులకి రాయండి. ఇది ముఖ్యంగా వేళ్ళ మధ్యన, చుట్టూ రాయటం మంచిది. అలాగే లిప్ బాం కళ్ళ కింద గీతలను మరియు కళ్ళ కింద క్రౌ ఫీట్ ను కూడా తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా మీకు కళ్ళ కోసం ప్రత్యేకంగా క్రీం కొనటం ఇష్టం లేకపోతే ఇలా చేయవచ్చు. వాస్తవానికి మామూలు మాయిశ్చరైజర్ ల కన్నా కంటి కింద లిప్ బామ్ లే ఎక్కువ తేమను అందిస్తాయి.