అందం: బీట్‌రూట్‌తో ఇలా చేస్తే.. అందం మొత్తం మీదే..!!

Kavya Nekkanti

బీట్ రూట్.. ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బీట్‌ రూట్ లో మనిషికి కావాల్సిన చాలా పోషకాలుంటాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు బీట్ రూట్ ను ఉపయోగిస్తే చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇక బీట్‌రూట్ ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌తో  చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్‌ బి బీట్‌రూట్‌‌లో పుష్క‌లంగాగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికి బీట్‌రూట్ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. 

 

అందుకు ముందుగా.. బీట్‌రూట్ జ్యూస్‌కు కొంత ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్నిఫేస్‌కు అప్లై చేసి కాసేపు ఉంచుకొని చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మానికి సహజ సిద్ధ సన్ స్క్రీన్‌గా పనిచేస్తుంది. అల్ట్రా వైలెట్ రేస్ నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది కూడా. అలాగే ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది. 

 

అదేవిధంగా, బీట్రూట్ పేస్ట్‌లో కొద్దిగా పంచదార వేసి రెండిటిని కలిపి పెదాలకి రాసుకుని ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే నల్లగా ఉండే పెదాలు ఎరుపు రంగులోకి మారి మీకు మరింత అందాన్ని తీసుకువ‌స్తాయి. మ‌రియు ఒక బౌల్‌లో బీట్‌రూట్‌ రసాన్ని తీసుకుని అందులో నిమ్మరసం, పెరుగు, శెనగపిండి వీలైతే ఒక స్పూన్‌ తేనె కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేయండి. పావుగంట తరువాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న మ‌లినాలు, మ‌చ్చ‌లు పోతాయి. అంతేకాకుండా, ముఖం కాంతివంతంగా మారుతుంది. కాబ‌ట్టి, ఈ సింపుల్ టిప్స్ త‌ప్ప‌కుండా ట్రై చేయండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: