అందం: తలకు పసుపు రాస్తే ఏం అవుతుందో తెలుసా..?
ఆడవారి అందాన్ని రెట్టింపు చేసి చూపే వాటిలో శిరోజాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా ఉండేవారిని చాలా మంది ఇష్టపడతారు కూడా. అయితే కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులన్నీ ఉపయోగిస్తారు. అయినప్పటికీ సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి. జేబుకు మాత్రం చిల్లుపడుతుంది.
ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అనేక మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడతారు. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోషకాహారలోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, రకరకాల మందులు వాడడం, విపరీతమైన ఒత్తిడి, టాక్సిక్ షాంపులు, హార్డ్ వాటర్, జుట్టుకు తగని హెయిర్ ఆయిల్ వాడకం ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. అయితే హెయిర్ ఫాల్ సమస్యను నివారించుకోవడానికి సులభమైన ఇంటి చిట్కాలు బోలెడు ఉన్నాయి. వాటిల్లో పసుపు ప్యాక్ కూడా ఒకటి.
అవును.. పసుపులో హెయిర్ లాస్ ను తగ్గించే ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. అందుకే షాంపూకు కాస్తంత పసుపును కలిపి వాడితే హెయిర్ తిన్నింగ్ సమస్య తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా మారతాయి. జుట్టు పొట్లిపోవడం కూడా తగ్గుతుంది. అలాగే కొద్దిగా పసుపు తీసుకుని అందులో కలబంద గుజ్జు మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మరియు శిరోజాలు హెల్తీగా అలాగే స్ట్రాంగ్ గా ఉంటాయి.