గంజి వల్ల ముఖ సౌందర్యానికి ఎన్ని ప్రయోజనాలో చూడండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... గంజి వల్ల గంజి తో ఫేస్ క్లెన్స్ చేస్తే ఫేస్ సాఫ్ట్ గా యంగ్ గా కనపడుతుంది. కొంత రైస్ వాటర్ ఒక కాటన్ పాడ్ మీద వేసి దానితో ఫేస్ అంతా మసాజ్ చేసి గాలికి ఆరనివ్వండి. ఇలా రోజూ అయినా చేయవచ్చు, టైం సరిపోదు అనుకుంటే కనీసం వారానికి రెండు సార్లైనా చేస్తే మీ స్కిన్ కి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి.

గంజి నీళ్లు అద్భుతమైన టోనర్ లా పని చేస్తుంది. కొంచెం రైస్ వాటర్ కాటన్ పాడ్ మీద వేసి దాన్ని క్లీన్ స్కిన్ మీద అప్లై చేయండి. ఈ టోనర్ స్కిన్ ని టైటెన్ చేసి, పోర్స్ ని మినిమైజ్ చేసి, స్కిన్ ని స్మూత్ గా బ్రైట్ గా చేస్తుంది.

గంజి కి ఉండే సూదింగ్ ఎఫెక్ట్ వల్ల అది యాక్నే కి మంచి ట్రీట్మెంట్ లా పని చేస్తుంది. అది యాస్ట్రింజెంట్ లా కూడా వర్క్ చేసి ముఖం మీద ఎర్రదనాన్ని తగ్గిస్తుంది. ఫ్యూచర్ బ్రేకౌట్స్ ని కంట్రోల్ చేస్తుంది.

ఎగ్జిమా తో వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడానికి గంజి లో ఉండే స్టార్చీ క్వాలిటీస్ హెల్ప్ చేస్తాయి. రైస్ వాటర్ లో ఒక క్లీన్ వాష్ క్లాత్ ముంచి ఆ తడి క్లాత్ తో ఎఫెక్టెడ్ ఏరియా ని పాట్ చేయండి. రెండు మూడు నిమిషాలు ఇలా చేసిన తరువాత స్కిన్ ని గాలికి ఆరనివ్వండి.

ఎగ్జిమా ఒక్కటే కాకుండా స్కిన్ ఇరిటేషన్స్ కి కూడా రైస్ వాటర్ పనికొస్తుంది. స్కిన్ బాగా దురదగా, ఇరిటేటింగ్ గా ఉన్నప్పుడు మీ బాత్ వాటర్ కి ఒకటి రెండు కప్పుల రైస్ వాటర్ యాడ్ చేసి స్నానం చేయండి.


సన్ బర్న్ వల్ల వచ్చే రెడ్ నెస్ నీ, ఇన్‌ఫ్లమేషన్ నీ రైస్ వాటర్ తగ్గిస్తుంది. బాగా రిలీఫ్ గా అనిపించాలంటే, ఫ్రిజ్ లో నుండి తీసిన రైస్ వాటర్ వెంటనే కాటన్ పాడ్ మీద వేసి ఎఫెక్ట్ అయిన ఏరియాస్ మీద అప్లై చేయండి.

వయసు వల్ల వచ్చే మార్పులతో చర్మం మీద అక్కడక్కడా కొంచెం స్కిన్ కలర్ మారవచ్చు. అలాంటివాటికి రైస్ వాటర్ మంచి మందు. ఒక టీ స్పూన్ రైస్ వాటర్ లో కొన్ని చుక్కలు జొజోబా ఆయిల్ వేసి ముఖానీకీ, మెడకీ మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: