పెదవులు పొడి బారకుండా లిప్ సిరప్ ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోండి...!!!
లిప్ సిరప్ ని ఇంట్లోనే ఈజీ గా ఇలా తయారు చేసుకోవచ్చు...
ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి రోల్-ఆన్-నాజిల్ ఉన్న ఒక చిన్న బాటిల్లో వేయండి. రాత్రి నిద్రకి ముందు ఈ సీరమ్ అప్లై చేయండి. పొద్దున్న ఫేస్ వాష్ చేసుకున్నాక కూడా మీకు కావాలనుకుంటే అప్లై చేయవచ్చు. కానీ, ఇది చాలా థిక్‌గా ఉంటుంది. ఇందులోని పసుపు లిప్స్‌ను మళ్ళీ సరైన రంగులోకి లోకి తెచ్చేస్తాయి. నెయ్యి చలి కాలంలో కావాల్సిన పోషణ అందిస్తుంది. లిప్స్ స్క్రబ్ చేసుకున్న వెంటనే ఈ సీరమ్ అప్లై చేయడం ఇంకా మంచిది.
మీద చర్మంతో పోల్చితే పెదవుల మీద స్కిన్ పలచగా ఉంటుంది. అందుకని లిప్స్ డ్రై అయిపోకుండా లిప్ బామ్ రక్షిస్తుంది.
లిప్ బామ్ లేదా లిప్ సిరప్ వాడడం వల్ల లిప్స్ యూత్‌ఫుల్‌గా కనపడతాయి.
ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ లేదా లిప్ సిరాప్స్ సన్ రేస్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....