ఎంత ట్రై చేసిన పెదాల పగుళ్లు తగ్గట్లేదా? అయితే ఈ పద్ధతులు పాటించండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో ఎంత ట్రై చేసిన పెదాలు పగుళ్ల సమస్య తగ్గట్లేదా? అయితే పద్ధతులు తెలుసుకోండి.... కీరా ముక్క తీసుకుని లిప్స్ మీద రబ్ చేయండి. ఆ జ్యూస్ ని పది నిమిషాల పాటు మీ లిప్స్ మీద అలా వదిలేయండి. ఆ తరువాత కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయవచ్చు.ఐదారు గులాబీ రేకులని పావు కప్పు పచ్చి పాల లో రెండు మూడు గంటల పాటు నానబెట్టండి.
ఆ తరువాత ఈ రేకుల్ని మెత్తటి పేస్ట్ లా చేత్తో నలపండి. ఈ పేస్ట్ ని పెదవులకి పట్టించి ఇరవై నిమిషాలు ఉంచండి. చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకొకసారి వారమంతా చేయండి.ఒక కప్పు వేడి నీటి లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ని కొన్ని నిమిషాల పాటు ఉంచండి. ఆ తరువాత ఆ బ్యాగ్ ని మీ లిప్స్ మీద కొన్ని నిమిషాల పాటూ ఉంచండి. రోజుకొకసారి ఇలా చేయవచ్చు.రాత్రి నిద్ర కి ముందు షియా బటర్ కానీ, కోకోవా బటర్ కానీ లిప్స్ కి పట్టించి రాత్రంతా అలా వదిలేయండి.
కొబ్బరి నూనె, లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి క్యారియర్ ఆయిల్ లో ఒకటి రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్, లేదా గ్రేప్ సీడ్ ఆయిల్, నీం ఆయిల్ వంటి ఎస్సెన్షియల్ ఆయిల్ కలపి పెదవుల మీద రాసి వదిలేయండి. రోజులో రెండు మూడు సార్లు ఇలా రాయవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసి రాత్రంతా కూడా వదిలేయవచ్చు.కొన్ని రోజుల పాటు రోజుకి ఒక సారి ఇలా చేయండి.మాటి మాటికీ లిప్స్ టచ్ చేయకండి.నాచురల్ ఇన్‌గ్రీడియెంట్స్ ఉన్న లిప్ బామ్ నే ఎంచుకోండి.సన్‌స్క్రీన్ ఉన్న లిప్ బామ్ వాడండి.లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: