చలికాలంలో ఈ పద్ధతులు పాటిస్తే జుట్టు రాలే సమస్య శాశ్వతంగా దూరమవుతుంది....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో సాధారణంగా చాలా మందికి తల స్నానం చేసేటప్పుడు జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఇక జుట్టు అలా రాలిపోకుండా ఉండటానికి షాంపు తో ఈ పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు... కొబ్బరి నూనె ని కొద్దిగా వెచ్చబెట్టి హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు పెరగడం  కూడా బాగా జరుగుతుంది.మామూలుగా షాంపూ తో నురగ వచ్చే వరకూ రుద్దుకోండి. మామూలుగా కడిగేయండి. కొబ్బరి నూనె మాయిశ్చర్ ని సీల్ చేసి జుట్టు డ్రై ఫ్రిజ్జీ గా అయిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.రెండు మూడు టేబుల్ స్పూన్ల షాంపూ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలపండి.

రెండూ బాగా కలిసేటట్లు కలపండి. మీ స్కాల్ప్ ని తడి చేసి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. బాగా మసాజ్ చేయండి.గోరు వెచ్చని నీటి కంటే మామూలు నీటితో నే హెయిర్ వాష్ చేసుకొండి. అంతే కాక ప్రతి రెండు రోజులకీ ఒకసారి హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. హెయిర్ మాస్క్స్ వేసుకోవడం కూడా హెల్ప్ చేస్తుంది.జుట్టు ఇంకా తడిగా ఉన్నప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళకండి. పొద్దున్న పూట ఆఫీసుకి వెళ్ళేలోపు జుట్టు పూర్తిగా ఆరదనుకుంటే సాయంత్రం హెయిర్ వాష్ చేసుకోండి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: