బేకింగ్ సోడాను ఇలా కూడా వాడొచ్చా...?

Naga Sai Ramya
బేకింగ్ సోడా అనేది వంటింటి పదార్థం. దీంతో డిజర్ట్స్ తో పాటు రుచికరమైన పదార్థాలను తయారుచేసుకోవచ్చు. అక్కడితో దీని పని పూర్తవలేదు. బేకింగ్ సోడాకు మీ బ్యూటీ కేబినెట్ లో కూడా స్థానం ఇవ్వండి. ఇది మీ చర్మంపై వండర్స్ చేస్తుంది. యాక్నేను తగ్గించడం దగ్గర నుంచి మీ పాదాలను మృదువుగా ఉంచే వరకు అలాగే శరీరంలోని దుర్వాసనను తగ్గించడం దగ్గర నుంచి స్కార్స్ ను తగ్గించేవరకు బేకింగ్ సోడా ఎన్నో అద్భుతాలను చేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో బేకింగ్ సోడా అనేది ఉండాలి. దీన్ని సరైన విధంగా వాడితే బ్యూటీ అనేది పెరుగుతుంది.

1. మొటిమలను తగ్గించేందుకు :

రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాను జెంటిల్ ఫేషియల్ క్లీన్సర్ లో కలిపి అందులో కాస్త వెచ్చటి నీటిని కలిపితే పేస్ట్ వంటి కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ పేస్ట్ తో ప్రభావిత ప్రదేశాలపై అప్లై చేయండి. పది నుంచి పదిహేను నిమిషాలవరకు అలాగే ఉంచి వెచ్చటి నీటితో శుభ్రపరచండి.

2. పెడిక్యూర్ కోసం :

బేకింగ్ సోడాను పెడిక్యూర్ గా వాడాలంటే, బకెట్ నిండా నీళ్లు తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడాను వేసి ఈ నీటిలో పాదాలను కాసేపు ఉంచండి. ఆ తరువాత డెడ్ స్కిన్ సెల్స్ ను స్క్రబ్ చేయడం కోసం ప్యూమిస్ స్టోన్ ను వాడండి.  ఆ తరువాత పాదాలను మాయిశ్చరైజ్ చేయడం మరచిపోకండి.

3. బ్యూటీ ప్రోడక్ట్స్ ను క్లీన్ చేయడం కోసం :

బ్రషెస్ అలాగే దువ్వెనలపై పేరుకున్న మట్టిని తొలగించేందుకు బేకింగ్ సోడా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఒక గిన్నె నిండా వెచ్చటి నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలిపి దానిలో దువ్వెనలను అలాగే బ్రషెస్ ను కాసేపు నానబెట్టాలి. ఇలా చేస్తే వాటిలో పేరుకున్న డస్ట్ ఈజీగా వచ్చేస్తుంది.  ఆ తరువాత మాములు నీటితో  వాటిని శుభ్రపరచాలి.  

4. శరీర దుర్వాసనను తగ్గించేందుకు :

బేకింగ్ సోడా శరీర దుర్వాసనను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. చర్మంపై ఉన్న మాయిశ్చర్ ను గ్రహించడం ద్వారా దుర్వాసన సమస్యను నిర్మూలిస్తుంది. బేకింగ్ సోడాతో పాటు జొన్నపిండిని సమాన మోతాదులో తీసుకుని ఈ మిశ్రమాన్ని అండర్ అర్మ్స్ లో అప్లై చేస్తే డియాడరెంట్ గా ఇవి పనిచేస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: