ముఖంపై రంధ్రాలు పోవడానికి ఈ పద్ధతులు పాటించండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.ముఖ సౌందర్యం కోసం మనం అనేక రకాలుగా కష్టాలు పడుతుంటాము.మొటిమలు వల్ల వచ్చిన రంధ్రాలు పోగొట్టుకోడానికి అనేక రకాల క్రీములు వాడుతాము. ఇంకా అనేక రకాల మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటాము.కాని వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు వుండవు. ఇక ఈ హోమ్ రెమిడీస్ ని పాటిస్తే మీ ముఖం పై రంధ్రాలని ఈజీగా తొలగించవచ్చు. ఇక ఆ పద్ధతులు ఏంటో తెలుసుకోండి....
ఎక్కువగా మంచి నీళ్లు  త్రాగండి. బయట  మీరు మీ ముఖం పైన ఎన్ని రకాలైన ఫేస్ ప్యాక్ లు వాడినా కాని  మీరు మీ శరీరం లోపల శుభ్రపరచకపోతే, మీరు కోరుకున్న అందం మీ సొంతం అవ్వదు. నీరు సహజ డిటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది, ఇది మీ శరీర వ్యవస్థను శుభ్రపరుస్తుంది ఇంకా శరీరం నుండి అవాంఛిత పదార్థాలను బయటకు పంపిస్తుంది.
మీరు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల మీ చర్మం శుభ్రపడి, కాంతివంతంగా ఉంటుంది. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల చర్మం యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీని వల్ల చర్మం తొందరగా పొడి బారకుండా ఉంటుంది. చర్మం లోని ఎలాస్టిసిటీ పెరగడం వల్ల చర్మం ఎక్కువ కాలం సాగిపోకుండా ఉంటుంది. దీని వల్ల వయస్సు తో వచ్చే గీతాలు, ముడతలు లాంటివి రావు. పుష్కలంగా నీరు త్రాగటం వల్ల మీ ముఖ చర్మంపై ఉన్న నూనె ఇంకా నీటి శాతాన్ని బాలన్స్ చేస్తుంది. దీని వల్ల ముఖం పై ఉన్న రంధ్రాలు శుభ్రపడి మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.కాబట్టి నీరు తాగండి.
మంచి నీళ్లు తాగిన తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే మొదట ఈ నీళ్లు తాగడం వల్ల మీ జీర్ణ క్రియ బాగా పనిచేస్తుంది. అంతేకాక అని రకాల వ్యర్ధ పదార్థాలను శరీరం లోపల నుండి బయటకు పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ చర్మానికి ఎంతో సహాయపడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: