చబ్బీ చీక్స్ మీకు కావాలా?

Divya

చబ్బీ చీక్స్.. డింపుల్ చిన్.. అని చిన్నప్పట్నుంచి మనం వింటూనే ఉన్నాము.బుగ్గలు లావుగా గుండ్రంగా ఉంటే అమ్మాయి అందం మరింత పెరుగుతుంది. ఇందుకోసం అమ్మాయిలు ఎన్నో ఆసనాలను వేస్తుంటారు. ఇంకా కొంతమంది చూయింగ్ గమ్ నమలడం వల్ల బుగ్గలు గుండ్రంగా,లావుగా అవుతాయి అని నమ్ముతారు.  కానీ అది ఎంతవరకు నిజం అనేది ఎవరూ నిరూపించలేకపోయారు.

సాధారణంగా అమ్మాయిలు అందంగా ఉండాలంటే బుగ్గలు గుండ్రంగా, లావుగా ఉండాలి. కానీ కొంతమంది శరీరం అందమైన ఆకృతిలో ఉన్నప్పటికీ, ముఖం మాత్రం నీరసంగా, బుగ్గలు లోపలికి పోయి, కళ్ళు గుంతలు పడి ఉంటాయి. మరికొంతమంది డిప్రెషన్ కు గురి అయినప్పుడు కూడా కళ్ళు లోపలికి పోయి, బుగ్గలు లోపలికి పోయి అందవిహీనంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజులు చెప్పబోతున్నాము. అవేంటో మీరు తెలుసుకొని అందంగా తయారవ్వండి.

ముఖానికి సంభందించిన కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల మన బుగ్గలు గుండ్రంగా తయారవడంతో పాటు అందంగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనది డీప్ బ్రీథింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ డీప్ బ్రీథ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం ముఖ్యంగా బుగ్గల నిండా గాలి నింపి, ఆ గాలిని 30 నుంచి 60 సెకన్ల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా గాలిని వదిలేయాలి. ఇలా రోజుకు 2నుండి  3 సార్లు చేస్తే మీ బుగ్గలు సహజసిద్ధంగా, యవ్వనంగా తయారవుతాయి.


ఇంకో పద్ధతి ఏమిటంటే రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లో, ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపి మీ బుగ్గలపైన మృదువుగా రాసి మెత్తగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా అవ్వడంతో పాటు బుగ్గలు ముడతలు లేకుండా గుండ్రంగా పెరుగుతాయి. గ్లిజరిన్,రోజ్ వాటర్ మన చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. కేవలం ఎక్సర్సైజ్ ద్వారానే కాకుండా శరీరానికి కావలసిన కాలరీలు,ప్రోటీన్లు, విటమిన్లను అందించాలి. ఇందుకోసం ప్రతి రోజూ రెండు గ్లాసుల పాలు ఉదయం ఒక గ్లాసు, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా  3 నెలలు ఎక్సర్సైజ్ తో పాటు, పాలు కూడా తాగడం వల్ల అందమైన మృదువైన బుగ్గలు మీ సొంతమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: