దానిమ్మతో కాంతివంతమైన అందం మీ సొంతం...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మంచి కాంతివంతమైన అందం కోసం దానిమ్మ కాయ చాలా మంచిది. దానిమ్మ కాయ రుచిగా, పోషక విలువలతో ఉండే పండు. గుండె పనితీరుని మెరుగుపరచడం దగ్గరనించీ, రోగనిరోధకశక్తిని పెంచే వరకూ దానిమ్మపండు మనకి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే, ఇది శరీరం లోపలికే కాదు, బయటికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దానిమ్మ పండు స్కిన్‌కి చేసే మేలు కూడా ఎక్కువే. ఈ పండు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముడతలు రాకుండా చూస్తుంది.

చర్మం మీద ఉండే మచ్చలని పోగొడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్లియర్, బ్యూటిఫుల్ స్కిన్ కోసం తీసుకునే కేర్ అంతా ఈ ఒక్కపండుతో అయిపోతుంది. క్లియర్, స్మూత్ స్కిన్ కోసం దానిమ్మ గింజల ఆయిల్‌తో ఎక్స్‌ఫోలియేషన్ చేయండి. ఈ దానిమ్మగింజల స్క్రబ్ తయారు చేయడానికి మీకు కావలసిందల్లా దానిమ్మ గింజలు, రోజ్ వాటర్ మాత్రమే. దానిమ్మ గింజల్ని రుబ్బి, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి.

వేళ్లతో మృదువుగా రుద్దుతూ ముఖమంతా నీట్‌గా స్క్రబ్ చేసేయండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఎంత ఫ్రెష్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంటుందో ఒక్క సారి చేసి చూస్తే మీకే తెలుస్తుంది.స్కిన్ టోనింగ్ వల్ల స్కిన్‌కి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. టోనింగ్ వల్ల మేకప్ కానీ, క్లెన్సెర్ కానీ మిగిలిపోతే ఈజీ గా తీసెయొచ్చు. రెగ్యులర్ టోనింగ్ వల్ల స్కిన్ హైడ్రేటెడ్ కూడా ఉంటుంది. దానిమ్మరసాన్ని స్కిన్ టోనింగ్ కూడా వాడొచ్చు. మీ ముఖాన్ని క్లెన్స్ చేసేసిన తర్వాత కొంచెం దానిమ్మ రసంలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి ముఖం మీద అప్లై చేయండి. ఈ రసం ఎక్కువగా రాస్తే ముఖం మీద చర్మం బాగా లాగినట్లుగా అయ్యి కడిగేసేవరకూ ఇబ్బంది పెడుతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ రాయండి.

ఫేస్ పాక్ వల్ల స్కిన్ డ్రై గా అవ్వకుండా ఉంటుంది. ఈ పాక్స్ స్కిన్ లో ఉన్న ఇంప్యూరిటీస్ తొలగించడంలో బాగా సాయపడతాయి. వాటిని చాలా పల్చగా అప్లై చేయాలి. వీటి ఫలితాలు కూడా తక్షణమే కనపడతాయి. దానిమ్మ రసాన్ని ఫేస్‌ప్యాక్ గా వాడొచ్చు. మీరు చేయాల్సిందల్లా దానిమ్మ రసం లో కొంచెం బెంటొనైట్, అజ్టెక్ క్లే కలిపి ముఖానికి అప్లై చెయ్యటమే. ఒక గంట తరువాత చల్లని నీటితో కడిగేయడమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: