కర్బుజ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Divya

కర్బుజ అనగానే ఎక్కువగా వేసవి కాలంలో దొరుకుతుందని మనకు తెలుసు. వేసవి తాపాన్ని తగ్గించే శక్తి కర్బుజాకు ఉంది. కర్బూజాను వేసవికాలంలో తినడం వల్ల ఎండలో పోగొట్టుకున్న పోషకాలను తిరిగి పొందేలా చేస్తుంది.  కర్బుజాను తినడం వల్ల ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎలా మన ముఖ సౌందర్యాన్ని పెంచుతుందో ఇప్పుడు చూద్దాం

వేసవి కాలంలో ఎండకు చర్మం కమిలిపోయి, ముడతలు రావడం, నల్లగా మారడం,మచ్చలు ఏర్పడడం లాంటివి మొదలవుతాయి. వీటిని తగ్గించుకోవడం కోసం కర్బుజా ఫేస్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కర్బూజాపండులో ఎక్కువగా విటమిన్ ఎ,విటమిన్ డి, విటమిన్ సి, భాస్వరం, క్యాల్షియం,మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల చర్మంతోపాటు జట్టు సంరక్షణకు కూడా ఎంతోగానో  సహాయపడుతుంది.

కర్బూజా పండు గుజ్జును తీసి ముఖానికి రాసి,పది నిమిషాల ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంతో పాటు,కొత్త కణాలు పెరగడానికి సహాయపడుతుంది.

కర్బూజాపండు గుజ్జుకు,ముల్తానీ మట్టిని కలిపి మెడకు, ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ను అందించడంలో ముల్తాని మట్టి, కర్బూజాపండు సంయుక్తంగా కలిసి మంచి ఫలితాన్ని అందిస్తాయి.

అంతేకాకుండా కర్బూజాపండులో  విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి హాని కలిగించే క్రిములతో పాటు క్యాన్సర్ ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇందులో విటమిన్-సి కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కర్బూజాపండు గుజ్జుకి తేనె కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాలు తరువాత కడిగేసుకుంటే చర్మం మృదువుగా తయారవడంతో పాటు ప్రకాశవంతంగా ఉంటుంది.

కర్బూజా గుజ్జుకు లావెండర్ ఆయిల్, తేనె సమపాళ్లలో కలిపి ముఖం,మెడ,చేతులు పైన రాసుకొని అరగంట ఆగి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం, మెడ చేతులు సుతిమెత్తగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: